జయ సమాధి వద్ద వీరాభిమాని పెళ్లి: అమ్మ అంటే ! (వీడియో)
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వీరాభిమాని బంధుమిత్రుల సమక్షంలో మెరినా బీచ్ లోని ఎంజీఆర్ సమాధి ప్రాంగణంలోని జయ సమాధి వద్ద పెళ్లి చేసుకుని అమ్మ భక్తిని చాటు కున్నాడు.
చెన్నైలోని కోళత్తూరు ప్రాంతానికి చెందిన ఫ్రాన్సిస్ అన్నాడీఎంకే యువజన విభాగం నాయకుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి రెజీలా ప్రీతి అనే యువతితో పెళ్లి నిశ్చయం అయ్యింది. 2017 ఫిబ్రవరి 1వ తేది పెళ్లి జరగవలసి ఉంది.
తన పెళ్లికి హాజరు కావాలని రెండు నెలల క్రితం ఫ్రాన్సిస్ జయలలితకు శుభలేఖ ఇచ్చారంట. పెళ్లికి తప్పకుండా వస్తానని జయలలిత హామీ ఇచ్చారని ఫ్రాన్సిస్ అంటున్నాడు. అయితే ఇటీవల అమ్మ మరణించడంతో ఫ్రాన్సిస్ షాక్ కు గురైనాడు.
వెంటనే రెజీలా ప్రీతి కుటుంబ సభ్యులను కలిసిన ఫ్రాన్సిస్ తాను అమ్మ సమాధి దగ్గర పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అందుకు ఇరుకుటుంబ సభ్యులు అంగీకరించారు. బుధవారం మెరీనా బీచ్ చేరుకుని అమ్మ సమాధి దగ్గర ఫ్రాన్సిస్, రేజీలా ప్రీతీ పూల దండలు మార్చుకున్నారు.
తరువాత ఫ్రాన్సిస్ రెజీలా ప్రీతి మెడలో మంగళసూత్రం కట్టారు. ఈ సందర్బంగా ఇరు కుటుంబ సభ్యులు జయ సమాధి మీద ఉన్న పూలనే వధూవరుల మీద చల్లి ఆశీర్వధించారు. ఈ సందర్బంలో ఫ్రాన్సిస్ మాట్లాడుతూ మా నాయకురాలు జయలలిత ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని గుర్తు చేశారు.
అయితే ఆమె అకాలమరణంతో తన ఆశ నెరవేరలేదని అనుకుంటున్న సమయంలో ఇరు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అమ్మ సమాధి సాక్షిగా వివాహం చేసుకున్నామని చెప్పారు. మొత్తం మీద జయ సమాధి దగ్గర మొట్టమొదటి సారి పెళ్లి చేసుకున్న జంటగా ఫ్రాన్సిస్, రేజీలా ప్రీతి రికార్డు సృష్టించారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications