వ్యాక్సిన్ పాలసీ, కరోనా నిర్వహణపై సుప్రీంకోర్టులో విచారణ: సాంకేతిక సమస్యతో వాయిదా

న్యూఢిల్లీ: దేశంలో కరోని పరిస్థితులు, నిర్వహణఫై సుప్రీంకోర్టు సోమవారం చేపట్టిన విచారణ సాంకేతిక సమస్య కారణంగా వాయిదా పడింది. కరోనా నిర్వహణ, కేంద్ర వ్యాక్సినేషన్ పాలసీ వంటి అంశాలపై సుప్రీంకోర్టులో సుమోటోగా కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వాటిపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్‌లతో కూడిన ప్రత్యక ధర్మానం సోమవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. అయితే, సాంకేతిక లోపం వల్ల వాదనలకు పలుమార్లు అంతరాయం కలిగింది. దీంతో విచారణను వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

COVID-19 COVID-19 management: Supreme Court defers hearing due to technical glitches

ఈరోజు(సోమవారం) సర్వర్ డౌన్ అయ్యింది. కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌ను మేం పరిశీలిస్తాం. దీనిపై తదుపరి విచారణను మే 13కు వాయిదా వేస్తున్నామని జస్టిస్ రవీంద్ర భట్ తెలిపారు. కరోనా సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు సుమోటో కేసుతోపాటు సుమారు 20 ఇతర పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిని కూడా అదే రోజు విచారిస్తామని స్పష్టం చేసింది.

వ్యాక్సిన్ విధానం, కరోనా నిర్వహణపై కేంద్రం ఆదివారం అర్ధరాత్రి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ ధరలు, కరోనా వ్యాక్సినేషన్ విధానంపై సుప్రీంకోర్టులో కేంద్రం తన వాదనలను వినిపించింది. అంతేగాక, వ్యాక్సిన్ పాలసీపై తన వాదనను సమర్థించుకుంది.

తమపై నమ్మకం ఉంచాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టుకు విన్నవించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా నిపుణలు, శాస్త్రీయ సలహాలతో టీకా విధానాన్ని రూపొందించామని సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రజా ప్రయోజనాల నిర్ణయాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం తగదని స్పష్టం చేసింది. ఈ మేరకు 208 పేజీల అఫిడవిట్‌ను సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+