పన్నీర్ సెల్వంకు భద్రత పెంపు.. సీఆర్పీఎఫ్ కమాండోల రక్షణ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు భద్రత పెంచారు. సోమవారం నుంచి సీఆర్పీఎఫ్ కు చెందిన కమాండోలు ఆయన భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు భద్రత పెంచారు. సోమవారం నుంచి సీఆర్పీఎఫ్ కు చెందిన కమాండోలు ఆయన భద్రతను పర్యవేక్షిస్తున్నారు. చెన్నయ్, అల్వార్ పేటలోని ఆయన నివాసం వద్ద పహారా కాస్తున్నారు.
ఈ నెల మొదట్లో పన్నీర్ కు 'వై' కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. జయలలిత మరణానంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పన్నీర్ సెల్వం వాహనంపై శశికళ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు.

ఈ విషయాన్ని పన్నీర్ వర్గం నేత మైత్రేయన్ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో, పన్నీర్ కు 'వై' కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.












Click it and Unblock the Notifications