Couple: ప్రభుత్వ ఉద్యోగి, ఆయన భార్య గొంతులు కోసి దారుణ హత్య, అర్దరాత్రి ? పక్కరూమ్ లో కూతురు !

లక్నో/అజంగర్: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వివాహం చేసుకుని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సొంత ఊర్లో నివాసం ఉంటున్న దంపతులు బంధువులతో కలిసి చాలా సంతోషంగా ఉంటున్నారు. ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెలుతున్న భర్త రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. దంపతుల పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. ఎప్పటిలాగే ఉద్యోగానికి వెళ్లిన వ్యక్తి రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అర్దరాత్రి గుర్తు తెలియన వ్యక్తులు ఇంట్లో చొరబడ్డారు. సౌండ్ రాకుండా ప్రభుత్వ ఉద్యోగితో పాటు అతని భార్య గొంతులు కోసి దారుణంగా చంపేసి పరారైనారు, మరుసటి రోజు ఉదయం కుమార్తెలు విషయం గుర్తించి గట్టిగా కేకలు వెయ్యడంతో విషయం వెలుగు చూసింది. రెవెన్యూ శాఖలో ఉన్నతస్థాయి ఉత్యోగం చేస్తున్న వ్యక్తితో పాటు అతని భార్యను దారుణంగా హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

నిత్యం హత్యలతో హాట్ టాపిక్

నిత్యం హత్యలతో హాట్ టాపిక్

ఉత్తరప్రదేశ్ లో నేరాలు, ఘోరాలు ఏరేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతినిత్యం హత్యలు, అత్యాచారాలతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రోజు హాట్ టాపిక్ లో ఉంటుంది. ఇలాంటి ఉత్తరప్రదేశ్ లో ఈ మద్యకాలంలో దళిత కుటుంబాలు, దళితులు దారుణ హత్యలకు గురౌతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి.

దళిత ఉద్యోగి

దళిత ఉద్యోగి

ఉత్తరప్రదేశ్ లోని అజంగడ్ లో నగీన్ (55) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. నగీన్ రెవ్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. నగీన్ కు నగీనా దేవి (52) అనే భార్య ఉంది. నగీన్, నగీనా దేవికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మౌజిల్లాలో నగీన్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజూ నగీన్ ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు.

 పెద్ద కుమార్తెకు పెళ్లి చేశారు

పెద్ద కుమార్తెకు పెళ్లి చేశారు


సొంత ఊర్లో నివాసం ఉంటున్న నగీన్, నగీనా దేవి దంపతులు బంధువులతో కలిసి చాలా సంతోషంగా ఉంటున్నారు. ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెలుతున్న నగీన్ రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. నగీన్, నగీనా దేవి దంపతుల పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. నగీన్ సోదరులు ముగ్గురు అదే ప్రాంతంలోనే వారి కుటుంబాలతో కలిసి నివాసం ఉంటున్నారు.

 దంపతుల దారుణ హత్య

దంపతుల దారుణ హత్య


ఎప్పటిలాగే ఉద్యోగానికి వెళ్లిన నగీన్ రాత్రి ఇంటికి చేరుకున్నాడు. రాత్రి నగీన్, నాగిని దేవి దంపతులు వారి ఇద్దరి కుమార్తెలతో కలిసి భోజనం చేసి తరువాత ఎవరి గదుల్లో వారు నిద్రపోయారు. అర్దరాత్రి గుర్తు తెలియన వ్యక్తులు ఇంట్లో చొరబడ్డారు. సౌండ్ రాకుండా ప్రభుత్వ ఉద్యోగి నగీన్ తో పాటు అతని భార్య నాగిని దేవి గొంతులు కోసి దారుణంగా చంపేసి పరారైనారు,

 హడలిపోయిన స్థానికులు

హడలిపోయిన స్థానికులు

మరుసటి రోజు ఉదయం కుమార్తెలు తల్లిదండ్రులు నగీన్, నాగిని దేవి దారుణ హత్యకు గురైన విషయం గుర్తించి గట్టిగా కేకలు వెయ్యడంతో ఆ విషయం వెలుగు చూసింది. రెవెన్యూ శాఖలో ఉన్నతస్థాయి ఉత్యోగం చేస్తున్న నగీన్ తో పాటు అతని భార్య నాగిని దేవిని గొంతులు కోసి ఇంత దారుణంగా హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో దళిత కుటుంబానికి చెందిన ఒకే ఇంటిలో నలుగురు దారుణ హత్యకు గురైన విషయం మరిచిపోకముందే మరో దళిత కుటుంబంలో దంపతులు దారుణ హత్యకు గురికావడంతో అక్కడి ప్రజలు హడలిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+