దాడి చేసి, దళిత యువకుడితో మలం తినిపించారు
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత అమానవీయమైన సంఘటన చోటు చేసుకుంది. సాటి మనిషి పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దళిత యువకుడిపై ముగ్గురు వ్యక్తులు దాడి, వారి చేత బలవంతంగా మలం తినిపించారు.
ఆ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కోట్వాలీ పోలీసు స్టేషన్ పరిధిలో గల బర్కాలీ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను శనివారంనాడు వెల్లడించారు.

బాధితుడి సోదరుడు పోలీసులకు సంఘటనపై ఫిర్యాదు చేశాడు. త్యాగి కమ్యూనిటీకి చెందిన ముగ్గురు వ్యక్తులు 24 ఏళ్ల గోవింద్ అనే వ్యక్తిని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి, దాడి చేశారు.
దొంగతనం చేశాడనే అనుమానంతో ఆ యువకుడిని తీసుకుని వెళ్లారు. సీనియర్ పోలీసులు జోక్యంతో ఈ సంఘటనపై శుక్రవారంనాడు కేసు నమోదైంది. ముగ్గురు అగ్రవర్ణ నిందితుల్లో లవకుశ్ త్యాగి, వినోద్ త్యాగి అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశఆరు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఆందోళనరకంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications