Daughter: అన్న కూతరిపై అత్యాచారం, హత్య, నెల రోజుల్లో చిన్నానకు ఉరిశిక్ష వేసిన కోర్టు, 29 మంది సాక్షం !

జైపూర్: తెలిసి తెలియని వయసులో ఆ అమ్మాయి సాటి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నది. చలాకిగా ఉంటున్న అమ్మాయి అంటే ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అందరికి చాలా ఇష్టం. అమ్మాయితో ఆమె చిన్నాన చాలా చనువుగా ఉండేవాడు. అప్పుడప్పుడు అమ్మాయిని ఆమె చిన్నాన బయటకు పిలుచుకుని వెలుతున్నాడు. నెల రోజుల క్రితం చిన్నాన వెంట ఆ అమ్మాయి వెళ్లింది. తరువాత ఆ అమ్మాయి ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు, స్థానికులు అమ్మాయి కోసం గాలించారు. ఊరి బయట పొదల్లో అమ్మాయి శవమై కనిపించింది. అమ్మాయి మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని వెలుగు చూసింది. అమ్మాయిని ఆమె చిన్నాన అత్యాచారం చేసి హత్య చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది. నెల రోజుల్లో కామాంధుడైన చిన్నానకు కోర్టు ఉరిశిక్ష విధించింది.

చలాకి అమ్మాయి

చలాకి అమ్మాయి


రాజస్థాన్ నాగ్ పూర్ లోని మార్ ట్నా సమీపంలో 7 సంవత్సరాల అమ్మాయి నివాసం ఉంటున్నది. తెలిసి తెలియని వయసులో ఆ అమ్మాయి సాటి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నది. చలాకిగా ఉంటున్న అమ్మాయి అంటే ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అందరికి చాలా ఇష్టం.

చిన్నాన వెంట వెలుతున్న అమ్మాయి

చిన్నాన వెంట వెలుతున్న అమ్మాయి


అమ్మాయికి దినేష్ జాటుగే అలియాస్ దినేష్ (25) అనే చిన్నాన ఉన్నాడు. అమ్మాయితో ఆమె చిన్నాన దినేష్ చాలా చనువుగా ఉండేవాడు. అప్పుడప్పుడు అమ్మాయిని ఆమె చిన్నాన దినేష్ బయటకు పిలుచుకుని వెలుతున్నాడు. అక్టోబర్ 5వ తేదీన చిన్నాన దినేష్ వెంట ఆ అమ్మాయి వెళ్లింది. ఆ సమయంలో దినేష్ వెంట అమ్మాయి వెలుతున్న విషయం ఆమె తల్లి గమనించింది.

 అత్యాచారం చేసి చంపేసిన చిన్నాన

అత్యాచారం చేసి చంపేసిన చిన్నాన


చిన్నాన దినేష్ వెంట వెళ్లిన ఆ అమ్మాయి తరువాత ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు, స్థానికులు అమ్మాయి కోసం గాలించారు. ఊరి బయట పొదల్లో అమ్మాయి శవమై కనిపించింది. అమ్మాయి మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. దినేష్ తన కూతురిని బయటకు పిలుచుకుని వెళ్లాడని హత్యకు గురైన అమ్మాయి తల్లి పోలీసులకు చెప్పింది.

29 మంది సాక్షుల విచారణ

29 మంది సాక్షుల విచారణ


దినేష్ అన్న కూతురి మీద అత్యాచారం చేసి చంపేశాడని వెలుగు చూసింది. పోలీసులు దినేష్ ను అరెస్టు చేశారు. 9 రోజుల పాటు ప్రత్యక్షసాక్షలు, గ్రామస్తులను పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. జైపూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరిగింది.
29 మంది సాక్షులను విచారణ చేసిన న్యాయమూర్తి రేఖా రాథోడ్ నిందితుడు దినేష్ నేరం చేశాడని రుజువు అయ్యిందని చెప్పారు.

నెల రోజుల్లో ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం

నెల రోజుల్లో ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం


అన్న కూతురి మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన దినేష్ కు న్యాయమూర్తి రేఖా రాథోడ్ ఉరి శిక్ష విధించారని ఏఎస్పీ సింగ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సోమర్ సింగ్ స్థానిక మీడియాకు మీడియాకు చెప్పారు. 7 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేసి హత్య చేసిన కేసు 11 రోజుల పాటు నిరంతరంగా కోర్టులో విచారణ జరిగిందని, నేరం జరిగిన నెల రోజుల లోపు నిందితుడికి ఉరిశిక్ష పడిందని పోలీసు అధికారులు అంటున్నారు. ప్రతినిత్యం చిన్నాన వెంట వెలుతున్న అమ్మాయిని నమ్మి అతని వెంట పంపించిన కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేసిన చిన్నానకు సరైన శిక్ష పడిందని గ్రామస్తులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+