Daughter: పుట్టింటికి జంప్ అవుతున్న భార్య, ఎక్కడో మండిపోయి మామను పొడిచేసిన అల్లుడు !
బెంగళూరు/ధారవాడ: ఓ యువకుడు పెళ్లి చేసుకుని అతని భార్యతో కొంతకాలం సంతోషంగా కాపురం చేశాడు. తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రానురాను దంపతుల మద్య గొడవలు ఎక్కువ కావడంతో పెద్దలు పంచాయితీలు చెయ్యలేక విసిగిపోయారు. ఇదే దెబ్బతో అల్లుడు అతని మామను పొడిచి పారేశాడు.
కర్ణాటకలోని ధారవాడలోని కమలాపురంలో సమీపంలోని శింగ్లావి ప్రాంతంలో యల్లప్ప ధూళప్ప అలియాస్ యల్లప్ప అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం హేమంత్ అనే యువకుడు యల్లప్ప కుమార్తెను వివాహం చేసుకున్నాడు. హేమంత్ అతని భార్యతో కొంతకాలం సంతోషంగా కాపురం చేశాడు.

తరువాత హేమంత్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భర్త హేమంత్ తో గొడవపడుతున్న అతని భార్య మాట్లాడితే పుట్టింటికి వెళ్లిపోతున్నది. పదేపదే పుట్టింటికి వెళ్లిపోతున్న భార్యకు నచ్చ చెబుతున్న హేమంత్ ఆమెను ఇంటికి పిలుచుకుని వస్తున్నాడు. అయితే హేమంత్ భార్య మాత్రం ఆమె పద్దతి మార్చుకోలేదు.
కమలాపపురలోని కూతురి ఇంటిలో గొడవ జరిగిందని తెలుసుకున్న యల్లప్ప అతని కుమార్తె ఇంటికి వెళ్లాడు. ఆ సందర్బంలో మామ యల్లప్ప, అల్లుడు హేమంత్ ల మద్య మాటల యుద్దం జరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన హేమంత్ కత్తి తీసుకుని అతని మామ యల్లప్పను పొడిచిపారేశాడు.
తీవ్రగాయాలైన యల్లప్పను ధారవాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మామ యల్లప్పు కత్తితో పొడిచిన అల్లుడు హేమంత్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన మీద మా మామ యల్లప్ప హత్యాయత్నం చేశాడని కేసు పెట్టాడు. అప్పటికే అసలు మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు హేమంత్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు.












Click it and Unblock the Notifications