ఇకపై ఎయిర్ ఇండియా విమానం ఎక్కను.. డేవిడ్ వార్నర్ సంచలన ప్రకటన

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై యావత్ భారతావనితోపాటు ప్రపంచ దేశాలు షాక్ కు గురయ్యాయి. ప్రపంచ దేశాల నేతలు, ప్రముఖులు ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.

అయితే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనపై ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంచలన ప్రకటన చేశారు. ఇకమీదట తాను ఎయిర్‌ ఇండియా విమానాలు ఎక్కనని తేల్చి చెప్పారు. ఈ మేరకు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై వార్నర్ సామాజిక మాధ్యమంలో స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇకపై తాను ఎయిర్ ఇండియా విమానం ఎక్కబోనని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వార్నర్ తన ఇన్​ స్టాలో స్టోరీ పోస్ట్ చేశారు. ఇంకోసారి తాను ఎయిర్ ఇండియా విమానం ఎక్కనంటూ ఆ సంస్థను ట్యాగ్ చేశారు. ఆయన పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. డేవిడ్ వార్నర్ పోస్టుపై నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన యావత్ భారత్ నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజీ వైద్య కళాశాల భవనంపై పడటంతో మరో 24 మంది వైద్య విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

David Warner s Explosive Vow I ll Never Fly Air India Again After Ahmedabad Crash

ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో భారత్ కు చెందిన 169 మంది ప్రయాణికులు మృతి చెందగా.. బ్రిటన్ కు చెందిన 53 మంది.. పోర్చుగీసుకు చెందిన ఏడుగురు.. కెనడాకు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక 625 అడుగుల ఎత్తులోంచి ఒక్కసారిగా విమానం కుప్ప కూలిపోవడంతో 265 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. దీంతో ఎవర్నీ గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు కనిపించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+