దావూద్ ఇబ్రహీంను వదిలేశారు: మాజీ ఐపీఎస్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి ఒక మాజీ పోలీసు అధికారి సంచలన వాఖ్యలు చేశారు. ప్రాణభయం పట్టుకున్న దావూద్ ఇబ్రహీం లొంగిపోతానని తనకు మూడు సార్లు ఫోన్ చేసి చెప్పాడని ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
1993 మార్చి 12వ తేదిన ముంబై లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ బాంబు పేలుళ్లు సృష్టించింది గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీమనే ఆరోపణలు వచ్చాయి. ఈ వరుస బాంబు పేలుళ్లలో 257 మంది మరణించారు. సుమారు 700 మందికి తీవ్రగాయాలైనాయి.

ముంబై వరస బాంబు పేలుళ్లు జరిగిన సమయంలో సీబీఐ డీఐజీగా నీరజ్ కుమార్ పని చేస్తున్నారు. ఆ సమయంలో తనకు దావూద్ ఇబ్రహీం మూడు సార్లు ఫోన్ చేసి లోంగిపోతానని మనవి చేశాడని అన్నారు. తను భారత్ వస్తే ప్రత్యర్థులు అంతం చేస్తారని అందుకే లొంగిపోవడానికి సిద్దం అయ్యానని చెప్పాడని సమాచారం.
అయితే కొన్ని కారణాల వలన సీబీఐ దావూద్ ఇబ్రహీం ఆఫర్ ను తిరస్కరించిందని మాజీ పోలీసు అధికారి నీరజ్ కుమార్ అంటున్నారు. తరువాత ప్రముఖ న్యాయవాది రామ్ జఠ్మలానిని పోలీసు అధికారుల దగ్గరకు పంపించి లొంగిపోతానని రాయబారం నడిపాడని నీరజ్ కుమార్ అంటున్నారు.
2013వ సంవత్సరం నీరజ్ కుమార్ ఢిల్లీ పోలీసు కమిషనర్ గా రిటైడ్ అయ్యారు. నీరజ్ కుమార్ పోలీసు అధికారిగా పని చేసిన సమయంలో ఎదురైన అనుభవాలను ఒక పుస్తక రూపంలో బయటకు తీసుకు వస్తున్నారు. అందులో ఇలాంటి బాంబు పేలుళ్ల వార్తలు ఎన్ని ఉంటాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications