DCM: హలో సార్, ఉప ముఖ్యమంత్రిని విచారణ చెయ్యడానికి వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న సీబీఐ !

సమన్లు జారీ చేసినా ఉప ముఖ్యమంత్రి రాలేదని సీబీఐ అధికారులు అంటున్నారు. ఉప ముఖ్యమంత్రిని విచారణ చెయ్యడానికి సీబీఐ అధికారులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

పాట్నా/న్యూఢిల్లీ: సీబీఐ అధికారులు నిమిషం తీరికలేకుండా పని చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓ స్కామ్ కు సంబంధించి ఏకంగా ఉప ముఖ్యమంత్రికి సమన్లు జారీ చేసిన సీబీఐ అధికారులు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. సమన్లు జారీ చేసినా ఉప ముఖ్యమంత్రి మాత్రం ఇంత వరకు మా ముందుకు రాలేదని సీబీఐ అధికారులు అంటున్నారు. ఉప ముఖ్యమంత్రిని విచారణ చెయ్యడానికి సీబీఐ అధికారులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రికి సీబీఐ సమన్లు

ఉప ముఖ్యమంత్రికి సీబీఐ సమన్లు

బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్ జేడీ నేత తేజస్వి యాదవ్ కు సమన్లు జారీ చేసిన సీబీఐ అధికారులు మార్చి 11వ తేదీ శనివారం ఉదయం విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. సీబీఐ అధికారుల ముందు ఉదయం 10. 30 గంటలకు ముందే బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ విచారణకు హాజరుకావలని ఉంది.

ఆరోజు రాలేదని మరోసారి సీబీఐ ?

ఆరోజు రాలేదని మరోసారి సీబీఐ ?

అయితే ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఇంత వరకు విచారణకు హాజరుకాలేదని శనివారం మద్యాహ్నం సీబీఐ అధికారులు చెప్పారని ప్రముఖ వార్త సంస్థ పీటీఐ తెలిపింది. మార్చి 4వ తేదీన విచారణకు హాజరుకావాలని గతంలో ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే ఆ రోజు తేజస్వి యాదవ్ విచారణకు హాజరణకు హాజరుకాకపోవడంతో మార్చి 11వ తేదీన విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు మరోసారి తేజస్వి యాదవ్ కు సమన్లు జారీ చేశారని పీటీఐ సంస్థ తెలిపింది.

భూములు తీసుకుని రైల్వేలో ఉద్యోగాలు ఫ్రీగా ఇచ్చేశారు

భూములు తీసుకుని రైల్వేలో ఉద్యోగాలు ఫ్రీగా ఇచ్చేశారు

తక్కువ ధరలకు భూములు ఇచ్చిన వారికి రైల్వేలు ఉద్యోగాలు ఇచ్చారని, ఇదో పెద్ద స్కామ్ అని గుర్తించిన సీబీఐ అధికారులు ఆర్ జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద కేసులు నమోదు చేసింది. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవిని సీబీఐ అధికారులు ఢిల్లీ, పాట్నాలో వేర్వేరుగా విచారణ చేసి స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు.

వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న సీబీఐ

వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న సీబీఐ

దేశంలోని 24 వేర్వేరు ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు చేసిన తరువాత సీబీఐ అధికారులు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కు సమన్లు జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ను విచారణ చేసి ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేసుకోవడానికి సీబీఐ అధికారులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రోజు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరౌతారా ?, లేదా ? అని ఆర్ జేడీ నాయకుల్లో టెన్షన్ మొదలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+