నిర్భయ గ్యాంగ్‌రేప్: ఇద్దరి మరణశిక్షపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: డిసెంబర్ 16వ తేదీన సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఇద్దరు దోషులకు పడిన ఉరిశిక్షపై సుప్రీంకోరట్ు సోమవారం స్టే ఇచ్చింది. అక్షయ్, వినయ్ శర్మలకు కింది కోర్టు విధించిన మరణశిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినట్లు టీవీ వార్తలు తెలియజేస్తున్నాయి.
నలుగురు దోషులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు చెప్పిన తీర్పును ఢిల్లీ హైకోర్టు నిరుడు మేలో సమర్థించింది. 2012 డిసెంబర్ 16వ తేదీన ఢిల్లీలో 23 ఏళ్ల అమ్మాయిపై ఘోరంగా అత్యాచారం చేసి, ఆమెను చంపేసిన విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా ఆందోళనకు దారి తీసింది.

ట్రయల్ కోర్టు నలుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. అరుదైన కేసుల్లో అరుదైన కేసుగా పరిగణిస్తూ నలుగురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి రామ్ సింగ్, వినయ్, అక్షయ్, పవన్, ముకేష్, మరో మైనర్ బాలుడు అమ్మాయిపై అత్యాచారం చేశారు. ఆమె స్నేహితుడిపై దాడి చేశారు.
అమ్మాయి సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2012 డిసెంబర్ 29వ తేదీన మరణించింది. ప్రధాన నిందితుడు రామ్‌సింగ్ తీహార్ జైలులో నిరుడు మార్చిలో మరణించాడు.












Click it and Unblock the Notifications