జయలలిత మేనకోడలు దీపా పక్కా వ్యూహంతో పోటీ, పన్నీర్ కూడా !
మెరీనా తీరంలో జయలలిత సమాధి వద్ద నివాళులర్పించినంతరణం ఇంటికి చేరుకున్న దీపా ఆర్ కే నగర్ లో సుడిగాలి పర్యటనకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆర్ కే నగర్ ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రచార పర్యటనకు కార్యచరణ.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు చెన్నైలోని ఆర్ కే నగర్ లో పోటీ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లూ చకచకా పూర్తి చేసుకుంటున్నారు. ఆర్ కే నగర్ ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రచార పర్యటనకు కార్యచరణ రూపొందించి ఉన్నారు.
మెరీనా తీరంలో జయలలిత సమాధి వద్ద నివాళులర్పించినంతరణం ఇంటికి చేరుకున్న దీపా ఆర్ కే నగర్ లో సుడిగాలి పర్యటనకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. ఎలాగైనా ఆర్ కే నగర్ లో విజయం సాధించాలని దీపా జయకుమార్ పక్కా ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు.

ఇక పన్నీర్ సెల్వం వర్గం నుంచి ఒకరిని పోటీ చేయించాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు, పన్నీర్ సెల్వం వర్గంలోని ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ (శశికళ బహిష్కరించారు) మధుసూదనన్ ఆర్ కే నగర్ నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ నియామకంలో ఎన్నికల యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆమేరకు స్పందించాలని పన్నీర్ సెల్వం వర్గం నిర్ణయించింది.
శశికళ వర్గం నుంచి పోటీ చెయ్యడానికి ఆమె అక్క కుమారుడు టీటీవీ. దినకరన్ సిద్దం అయ్యారు. ఆర్ కే నగర్ నియోజక వర్గంలోని నాయకులను పిలిపించుకుని మంతనాల్లో మునిగిపోయారు. ఆర్ కే నగర్ లో గెలుపుతో ప్రభుత్వాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవడానికి దినకరన్ వ్యూహరచన చేస్తున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications