వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిబ్రవరి 24న, దీప కీలక ప్రకటన, పార్టీ ఏర్పాటుపైనేనా..!

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు ఫిబ్రవరి 24వ, తేదిన రాజకీయపార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు ఫిబ్రవరి 24వ, తేదిన రాజకీయపార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

అన్నాడిఎంకె పార్టీ అంతర్గత సమస్యలు నెలకొన్న సమయంలో జయలలిత మేనకోడలు దీప రాజకీయపార్టీని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకొంది.

అయితే రాజకీయాల్లోకి వస్తానని దీప ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 17వ, తేదిన ఆమె రాజకీ రంగ ప్రవేశం గురించి ప్రకటించారు.

అయితే రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై పిబ్రవరి 24వ, తేదిన ఆమె కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

ఫిబ్రవరి 24న, పార్టీపై దీప ప్రకటన

ఫిబ్రవరి 24న, పార్టీపై దీప ప్రకటన

అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ బాద్యతలు తీసుకొన్న తర్వాత దీప రాజకీయాల్లోకి కోరుకొనే వారి సంఖ్య కూడ పెరిగింది. అన్నాడిఎంకె పగ్గాలను శశికళ తీసుకోవడం ఇష్టం లేనివారు దీపకు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు దీప ఇంటి వద్దకు వందలాది మంది వచ్చి ఆమెను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు.రాజకీయాల్లోకి వస్తానని ఆమె ఈ నెల 17న, కీలకమైన ప్రకటన చేశారు.మరో వైపు పిభ్రవరి 24వ, తేదిన ఆమె రాజకీయ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

వదంతులు నమ్మకూడదు

వదంతులు నమ్మకూడదు

తనపై వచ్చే వదంతులు నమ్మకూడదని జయ మేనకోడలు దీప ప్రకటించారు. రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తానని ఆమె ప్రకటించారు. పుదుక్కొట్టే , పట్టుక్కొట్టే, కోయంబత్తూరు తదితర జిల్లాల నుండి వచ్చిన అన్నాడిఎంకె కార్యకర్తలనుద్దేశించి దీప మాట్లాడారు. తనను నమ్మి వచ్చేవారికి విడిచిపెట్టబోనని ఆమె ప్రకటించారు.ఎన్ని అడ్డంకులు వచ్చినా తాను ప్రజా సేవకు సిద్దంగా ఉన్నానని ఆమెప్రకటించారు.

దీపపై పెరుగుతున్న ఒత్తిడి

దీపపై పెరుగుతున్న ఒత్తిడి

జయ మేనకోడలుపై ఒత్తిడి పెరుగుతోంది. జల్లి కట్టు ఆందోళనలు ముగిసిన నేపథ్యంలో దీప రాజకీయ రంగ ప్రవేశం మరోసారి తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. ప్రతి రోజూ దీప ఇంటికి వచ్చి ఆమెకు మద్దతుగా ఆందోళనలు సాగిస్తున్న ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. ఫిబ్రవరి 24వ, తేది కంటే ముందుగానే రాజకీయపార్టీ ఏర్పాటు విషయాన్ని ప్రకటించాలని దీపపై ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

అన్నాడిఎంకెలో అసంతృప్తి కలిసివచ్చేనా?

అన్నాడిఎంకెలో అసంతృప్తి కలిసివచ్చేనా?

అన్నాడిఎంకెలో నెలకొన్న అసంతృప్తి జయ మేనకోడలు దీపకు కలిసివచ్చేనా అనే చర్చ సాగుతోంది. దీప రాజకీయపార్టీని ఏర్పాటుచేస్తే అన్నాడిఎంకెలో అసంతృప్త నేతలంతా దీపకు మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు నెలకొన్నాయి. కొందరు అసంతృప్త నాయకులు దీప వైపుకుక వెళ్ళేందుకు ఆసక్తిని చూపుతున్నారని ప్రచారం సాగుతోంది.దీపను రాజకీయాల్లోకి రావాలని కోరుతూ వచ్చేవారిలో అత్యధికులు అన్నాడిఎంకె కార్యకర్తలే కావడం గమనార్హం.

దీప కు మద్దతు లభిస్తోందా?

దీప కు మద్దతు లభిస్తోందా?

శశికళపై కేసులున్నాయి.ఈ కేసులకు సంబంధించిన తుది తీర్పులు ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే అన్నాడిఎంకెలో నాయకత్వ శూన్యత ఏర్పడితే ఈ ఖాళీని ఎవరూ భర్తీ చేస్తారనే చర్చకూడ లేకపోలేదు.అయితే అలాంటి పరిస్థితి ఏర్పడితే దీప ఈ ఖాళీని భర్తీ చేసే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలున్నాయి.అయితే వీటన్నింటిని దృష్ట్యా దీప రాజకీయంగా బలపడాలని కోరుకొనేవారు కూడ లేకపోలేదు. అన్నాడిఎంకె పార్టీలో కొందరు అసంతృప్తులు దీపకు పరోక్షంగా మద్దతిచ్చే అవకాశాలను కొట్టిపారేలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
deepa will be announced party on feb 24 .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X