బీజేపీకి ఊహించని దెబ్బ.. ఢిల్లీలో సింగిల్ డిజిట్‌కు పరిమితం.. మళ్లీ 60 మార్కును దాటిన ఆప్
''రాసిపెట్టుకోండి.. ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ ఊడ్చిపెట్టుకుపోతాయి.. కనీసం 50 సీట్లకు తగ్గకుండా ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు మీరంతా షాకవుతారు..''అని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ మంగళవారం ఉదయం కూడా ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు అమిత్ షా సైతం తాము ఈజీగా 45 సీట్లు సాధిస్తామని పక్కాగా చెప్పారు. ఫలితాల ట్రెండ్స్ వెలువడిన తొలి రెండు గంటల్లో బీజేపీ కనీసం 30 సీట్లకు చేరువ కావొచ్చనే భావన వ్యక్తమైంది. కానీ నిమిషనిమిషానికీ అది దిగజారుతూ... చివరికి సింగిల్ డిజిట్ కు పరిమితమైపోవడంతో కాషాయ పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి లోనయ్యాయి.

ఓట్లు పడ్డా.. సీట్లు రాలే..
ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై చాలా ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలల్లో దాదాపు 40 శాతం ఓటింగ్ సాధించిన ఆ పార్టీ.. మొదటి నాలుగు రౌండ్స్ లో మంచి ప్రదర్శన కనబర్చినా.. చివరికొచ్చేసరికి చతికిలపడింది. ఓట్ల శాతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ. సీట్ల పరంగా మాత్రం బాగా వెనుకబడిపోయింది. చివరి రౌండ్ ఫలితాల సమయానికి బీజేపీ కేవలం 7 స్థానాలను మాత్రమే గెలవగలిగేస్థితికి దిగజారింది. తుది ఫలితాల్లోనూ బీజేపీ సింగిల్ డిజిట్ కు పరిమితం కావడం దాదాపు ఖరారైంది.

ఆరు చోట్ల హైడ్రామా..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం ఖరారైన తర్వాత కూడా బీజేపీ కనీసం 20 స్థానాల్లో లీడింగ్ కనబర్చింది. ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ 18 నుంచి 12 దగ్గర నిలచింది. ఆప్ 58, బీజేపీ 12 సీట్లలో విజయం సాధిస్తాయని భావించగా.. ఆరు స్థానాల్లో చివరి రౌండ్ ఫలితాలు ఊహించనిమలుపు తిరిగాయి. ఆదర్శ్ నగర్ లో ఆప్, బీజేపీ అభ్యర్థుల మధ్య కేవలం 400 ఓట్ల తేడా ఉండగా, లక్ష్మీనగర్ లో 800, బిజ్వాషాన్ లో 1300, నజఫ్ గఢ్ లో 1500, ఫత్తర్ గంజ్ లో 3000, ఛత్తర్ పూర్ లో 3300 ఓట్ల తేడాతో ఒవరాల్ ఫలితాల నంబర్లు మారాయి.

60 మార్కు దాటిన ఆప్..
ఢిల్లీలో మారోసారి బాద్షాగా నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్ల మార్కును దాటడం గమనార్హం. మొత్తం 70 స్తానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి 2015లో జరిగి ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు గెలుచుకోగా... ఇప్పుడు 63 సీట్లను ఖాతాలో వేసుకుంది. ఆప్ తొలిసారి బరిలోకి దిగిన 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లు సాధించింది. అప్పుడు కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ తొలిసారి సీఎం అయ్యారు. అయితే ఏడాది తిరక్కముందే ఆ ప్రభుత్వం కూలిపోయి, రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితి తలెత్తింది. మళ్లీ 2015లో 67 సీట్లతో ఆప్ ప్రభంజనం సృష్టించగా.. 2019లోనూ 63 సీట్లతో అదే రిపీటైంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications