ఎగ్జిట్ పోల్స్: కిరణ్ బేడీపై కేజ్రీవాల్ పైచేయి, పెద్ద పార్టీగా అప్

న్యూఢిల్లీ: జాతీయ చానెళ్ల ఎగ్జిట్ పోల్ సర్వేలు అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఢిల్లీ శాసనసభలో మొత్తం 70 శాసనసభా స్థానాలున్నాయి. శనివారంనాడు శాసనసభ ఎన్నికలకు 70 శాతం పోలింగ్ నమోదైంది. బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీపై అరవింద్ కేజ్రీవాల్ పైచేయి సాధించిన సూచనలు కనిపిస్తున్నాయి.
సీ - ఓటర్ సర్వే ఆమ్ ఆద్మీ పార్టీకే ఎక్కువ సీట్లు ఇచ్చింది. ఆప్‌కు 31 నుంచి 39 సీట్లు, బిజెపికి 27 నుంచి 35 స్థానాలు, కాంగ్రెసు పార్టీకి 2 నుంచి 4 స్థానాలు రావచ్చునని అంచనా వేసింది. దీని ప్రకారం త్రిశంకు అసెంబ్లీ కూడా ఏర్పడే అవకాశం లేకపోలేదు. దీని ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుంది.
ఇండియా టుడే - సిసిరో ఎగ్జిట్ పోల్ సర్వే ఆమ్ ఆద్మీ పార్టీకి 35 నుంచి 43 స్థానాలు, బిజెపికి 23 నుంచి 29 సీట్లు, కాంగ్రెసుకు 3 నుంచి 5 సీట్లు రావచ్చునని అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం త్రిశంకు అసెంబ్లీకి అవకాశం లేదు.
హెడ్ లైన్స్ టుడే సర్వే ప్రకారం - ఆమ్ ఆద్మీ పార్టీకి 35 నుంచి 43 సీట్లు, బిజెపికి 23 నుంచి 36 సీట్లు, కాంగ్రెసుకు 3 నుంచి ఐదు సీట్లు వస్తాయి.
టైమ్స్ నౌ సర్వే ప్రకారం - ఆమ్ ఆద్మీ పార్టీకి 31 నుంచి 36 సీట్లు, బిజెపికి 27-35 స్థానాలు, కాంగ్రెసుకు 2 నుంచి 4 సీట్లు వస్తాయి.
ఎబిపి నీల్సన్ సర్వే ప్రకారం - ఆమ్ ఆద్మీ పార్టీకి 39 సీట్లు, బిజెపికి 28 స్థానాలు, కాంగ్రెసుకు 3 స్థానాలు వస్తాయి. ఎన్డీటీవి కూడా ఆమ్ ఆద్మీ పార్టీవైపే మొగ్గు చూపుతోంది.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications