Delhi Liquor Scam: అభిషేక్ రావుకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్..
ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ కొసాగుతోంది. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ బెయిల్ పై స్టే ఇవ్వాలని ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. కానీ బెయిల్ పై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది. బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ ఈడీ కస్టడీ ముగియడంతో వీరిద్దరిని ఢిల్లీ సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. విజయ్ నాయర్‌ను మరో వారం రోజులు కస్టడీ కావాలని ఈడీ కోర్టును కోరింది. విజయ్ నాయర్ ల్యాప్‌టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని.. డేటా రికవరీ జరగుతోందని తెలిపింది.
లాప్ టాప్
లాప్ టాప్ లో చాలా కీలకమైన డాక్యుమెంట్స్, ఆధారాలు ఉన్నాయని చెప్పారు. లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్ లాప్ టాప్ రిపోర్ట్ చాలా కీలకమని తెలిపారు. 100 కోట్ల రూపాయిలు చేతులు మారాయన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ల్యాప్ టాప్ రిపోర్టు రేపు రానుందని ఈడీ తరపు న్యాయవాదులు చెప్పారు. దీంతో సీబీఐ స్పెషల్ కోర్టు అభిషేక్ కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. జైల్లో బుక్స్ , మెడిసిన్ ,ఉలెన్ బట్టలు, కేతిల్ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించింది .

ఇంటి భోజనం
అయితే ఇంటి భోజనం కుదరదని తేల్చి చెప్పింది. ఒక వేళ డాక్టర్లు సూచిస్తే మాత్రం ఆ భోజనం కూడా జైలు కిచన్ లో తయారుచేసి అందించాలని చెప్పింది. డేటా అనాలసిస్ పేరుతో తన క్లయింట్ ను ఇబ్బంది పెడుతున్నారని విజయ్ నాయర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ లిక్కర్ కేసులు మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications