Kejriwal: సుప్రీం తీర్పుతో చర్యలు ప్రారంభించిన ఢిల్లీ సీఎం.. ఓ అధికారిపై బదిలీ వేటు..
సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయాలుతీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని వారిపై చర్యలు తీసుకున్నారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో పాలనా అధికారం ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాలనా వ్యవహారాల్లో కీలక చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు వినని వారిపై బదిలీ వేటు వేశారు.
ఇందులో భాగంగా ఢిల్లీ ప్రభుత్వ సేవల విభాగంలో పనిచేస్తున్న అషిష్ మోర్ అనే సీనియర్ అధికారిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి ఏకే సింగ్‌ను అపాయింట్ చేశారు. పాలనపరంగా మరిన్ని మార్పులు ఉంటాయని కేజ్రీవాల్ అధికారులను పరోక్షంగా హెచ్చరించారు. ఢిల్లీలో ఇన్ని రోజులు లెఫ్టినెంట్ గవర్నర్ ఆప్ ప్రభుత్వాన్ని గ్యాబ్ వచ్చింది.

ప్రస్తుతం పాలన నియంత్రణ తమ వద్ద ఉందని కేజ్రీవాల్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సరిగా పనిచేయని అధికారులు, ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అధికారుల బదిలీ అధికారం ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటుందని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. అధికారులు ప్రభుత్వాదేశాల ప్రకారం పనిచేయాలని కోరారు.
ఢిల్లీలో గత కొన్నేళ్లుగా ప్రభుత్వశాఖల్లో అధికారుల నియమాలను కేంద్ర హోంశాఖ నియంత్రిచండంతోపాటు, తమ ప్రభుత్వ నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుకుంటున్నారని కేజ్రీవాల్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఢిల్లీలోని అన్ని పాలనా సర్వీసుల పై కేంద్రానికే నియంత్రణ ఉంటుందంటూ 2015లో కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు.
అక్కడ ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ జరిపి ఎన్నికైన ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయని గురువారం తీర్పు వెల్లడించింది.












Click it and Unblock the Notifications