రోడ్డుపై నమాజ్ చేస్తున్న ముస్లింలను కాలితో తన్నిన ఢిల్లీ పోలీసు- సస్పెన్షన్..!
ఢిల్లీలో ఇవాళ ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇంద్రలోక్ ప్రాంతంలో రోడ్డుపై శుక్రవారం ప్రార్ధనలు చేసుకుంటున్న ముస్లింలను ఓ పోలీసు అధికారి కాలితో తన్నాడు. మరికొందరిని చేతులతో తన్నాడు. ట్రాఫిక్ కు ఆటంకం కలిగిస్తున్నందుకు వీరిని తన్నినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నమాజ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని పోలీసు తన్నడం మానవత్వం యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హీ తప్పుబట్టారు. ఈ పోలీసు హృదయంలో నిండిన ఈ ద్వేషం ఏమిటో, ఢిల్లీ పోలీసులు ఈ అధికారిపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో ఢిల్లీ పోలీసులు కూడా ఈ ఘటనపై స్పందించారు. వివరాలు అడిగి తెలుసుకున్న ఉన్నతాధికారులు.. ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.

ఇంద్రలోక్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) ఎంకే మీనా స్పందిస్తూ.. దీనిపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ఆ అధికారిని తక్షణమే సస్పెండ్ చేశామని, క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటామని డీసీపీ వెల్లడించారు. రోడ్డుపై నమాజ్ చేసుకుంటున్న ముస్లింలను అకారణంగా కాలితో పోలీసు అధికారి కాలితో తన్నిన ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
नमाज़ पढ़ते हुए व्यक्ति को लात मारता हुआ ये @DelhiPolice का जवान शायद इंसानियत के बुनियादी उसूल नहीं समझता, ये कौन सी नफ़रत है जो इस जवान के दिल में भरी है, दिल्ली पुलिस से अनुरोध है कि इस जवान के खिलाफ़ उचित धाराओं में मुक़दमा दर्ज करिये और इसकी सेवा समाप्त करिये। pic.twitter.com/SjFygbQ5Ur
— Imran Pratapgarhi (@ShayarImran) March 8, 2024












Click it and Unblock the Notifications