కరాచీ విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్స్ ల్యాండ్: ప్రయాణికుడు మృతి
ఢిల్లీ నుంచి దోహా వెళ్తున్న ఇండిగో విమానం(6ఇ-1736).. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పాకిస్థాన్ దేశంలోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి దోహా వెళ్తున్న ఇండిగో విమానం(6ఇ-1736).. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పాకిస్థాన్ దేశంలోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. అయితే, అప్పటికే వైద్యం అత్యవసరమైన ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడని ఇండిగో వెల్లడించింది.
మరణించిన వ్యక్తిని నైజీరియాకు చెందిన అబ్దుల్లా అనే 60 ఏళ్ల ప్రయాణికుడిగా గుర్తించారు. విమానం దిగిన వెంటనే కరాచీ విమానాశ్రయంలోని పాకిస్థాన్ వైద్య బృందం అబ్దుల్లాకు చికిత్స అందించేందుకు ప్రయత్నించింది. అయితే, అప్పటికే అబ్దుల్లా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ క్రమంలో అతని డెత్ సర్టిఫికేట్‌ను అందించారు.

ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడికి అత్యవసర వైద్య సహాయం అవసరం కావడంతో కరాచీ ఎయిర్ పోర్టులో ఆ విమానం ల్యాండైందని సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
మెడికల్ ఎమర్జెన్స్ కావడంతో కరాచీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్.. ఇండిగో విమానం ఎమర్జెన్స్ ల్యాండింగ్ కోసం అనుమతిచ్చింది. ఇండిగో ఫ్లైట్ పైలట్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.ఇక విమానంలోని ఇతర ప్రయాణికులను గమ్య స్థానానికి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications