వచ్చారు.. అనుకున్నది సాధించారు.. వెళ్లిపోయారు: జంతర్ మంతర్ ఖాళీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ల లీకేజీ వివాదానికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడంతో.. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని వేదికగా సాగుతున్న విద్యార్థుల ఉధృత నిరసనలు ముగిశాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆందోళనలను పూర్తిగా విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనత పార్టీ ప్రకటించింది. ఇది దేశ యువత సాధించిన అత్యంత చారిత్రక విజయంగా అభివర్ణించింది.
శనివారం ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దేశంలోని కోట్లాది మంది యువత ఆకాంక్షలను, భావోద్వేగాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపినట్లు వెల్లడించారు. దీనికి రాష్ట్రపతి భవన్ ఆమోదించింది. ఈ కీలక పరిణామంతో నిరసనల్లో నిమగ్నమైన విద్యార్థి సంఘాలు తమ ఆందోళనలను ముగిస్తున్నట్లు ప్రకటించాయి.

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతో పాటు నిరసనకారులు లేవనెత్తిన మరో మూడు కీలక డిమాండ్లను అంగీకరించేందుకు మోదీ ప్రభుత్వం ఓకే చెప్పింది.దీంతో నిరసనకారులు జంతర్ మంతర్ వద్ద తమ నిరసనలకు పుల్ స్టాప్ పెట్టారు. జాతీయ జెండాలతో విజయోత్సవాలు జరుపుకొన్నారు. స్వీట్లను పంచిపెట్టారు. పోలీసులకు కూడా స్వీట్లు ఇచ్చారు. జైహింద్ అంటూ నినదించారు. ఈ నినాదాలతో జంతర్ మంతర్ ప్రాంతం మొత్తం కూడా మార్మోగింది. చివరిగా జాతీయ గీతాన్ని ఆలపించి.. జంతర్ మంతర్ ను ఖాళీ చేశారు.
దీంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది జంతర్ మంతర్ వద్ద క్లీనింగ్ చర్యలు చేపట్టారు. అక్కడ అమర్చిన బ్యారికేడ్లు, ఫెన్సింగ్ అడ్డంకులను తొలగించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బుల్ డోజర్లతో నిరసన వేదికలను తీసివేశారు. రాత్రంతా ఈ పనులు ఎడతెరిపి లేకుండా సాగాయి. బ్యారికేడ్ల తొలగింపు ఇంకా కొనసాగడం కనిపించింది. తెల్లవారే సరికి జంతర్ మంతర్ ప్రాంతం అంతా కూడా దాదాపుగా నిర్మానుష్యంగా మారింది.
#WATCH | Delhi | Clearance work underway at the Cockroach Janta Party (CJP) protest site at Jantar Mantar after the party called off it's agitation yesterday following Dharmendra Pradhan's resignation. pic.twitter.com/yFJyJOxuZY
— ANI (@ANI) July 26, 2026
అటు ఢిల్లీలో కూడా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్ని రోజులు స్తంభించిపోయిన మెట్రో స్టేషన్ల కార్యకలాపాలు పునరుద్ధరణకు నోచుకున్నాయి. ఈ తెల్లవారు జాము నుంచి అన్ని స్టేషన్లన్నింటినీ తెరిచినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. మెట్రో రైళ్ల రాకపోకలు సాధారణంగా సాగుతున్నట్లు తెలిపింది. ఎక్కడా ఎటువంటి అవాంతరాలు కలగట్లేదని వివరించింది. ప్రయాణికులు ఎప్పట్లాగే వాటిని వినియోగించుకోవచ్చని పేర్కొంది.
VIDEO | Delhi: Clearance work is underway at Jantar Mantar after the Cockroach Janta Party (CJP) called off its 36-day-long agitation.
— Press Trust of India (@PTI_News) July 26, 2026
Dharmendra Pradhan resigned as Union education minister on Saturday following weeks of CJP-led nationwide protests over alleged irregularities… pic.twitter.com/btwqWKagJS












Click it and Unblock the Notifications