మోడీకి కేజ్రీవాల్ షాక్.. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరంటే?
ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. దీంతో ఆయన జైలు నుంచి పరిపాలన కొనసాగిస్తారని ఆప్ నాయకులు చెబుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి పదవి కోసం అతని భార్య సునీతా కేజ్రీవాల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
లాలూ చూపిన బాటలో
ప్రస్తుతం ఆమె రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే భర్తను అరెస్ట్ చేయడంతో బీజేపీపై విమర్శల దాడి పెంచారు. తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమే అవుతారంటూ వార్తలు వస్తున్నాయి. అవినీతి కేసులో అరెస్టయిన లాలూప్రసాద్ యాదవ్ కు బదులుగా ఆయన భార్య రబ్రీదేవి గతంలో బీహార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అదేదారిలో సునీత పయనిస్తారంటున్నారు.

ప్రజల్లో ఆదరణ
ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఐఆర్ఎస్ అధికారిణిగా గతంలో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆమెకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఎన్నికల ప్రజారంలో కూడా పాల్గొన్నారు. ఆప్ ప్రధాన నేతలైన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా కూడా జైలులో ఉండటంతో సునీత సీఎం పగ్గాలు చేపట్టే అవకాశం ఉందంటున్నారు.
జైలు నుంచే అరవింద్ ప్రభుత్వాన్ని నడపాలంటూ ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు సునీతా కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని రెండుకోట్ల మంది ప్రజలు ఆప్ వెంటే ఉన్నారని, అరవింద్ తన పదవికి రాజీనామా చేయవద్దని కోరారు. ఈ సమావేశానికి మంత్రులతో సహా 55 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరో నలుగురు మాత్రం ఢిల్లీలో లేరు. మిగిలిన ముగ్గురు తీహార్ జైలులో ఉన్నారు. తమ సందేశాన్ని కేజ్రీవాల్ కు తెలియజేయాలని వారంత సునీతను కోరారు.












Click it and Unblock the Notifications