ప్రధాని మోదీ తల్లిపై ఏఐ వీడియో.. కాంగ్రెస్ పై FIR నమోదు
ప్రధాని మోదీ తల్లి ఏఐ వీడియోపై దిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఐటీ సెల్ విభాగంపై కేసులు నమోదు చేశారు. దిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బీజేపీ దిల్లీ ఎలక్షన్ సెల్ కన్వీనర్ సంకేత్ గుప్తా ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు FIR నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఐటీ సెల్ విభాగంను ప్రధాన నిందితులుగా చేర్చారు. పలు సెక్షన్లు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఏఐ వీడియోను బీహార్ కాంగ్రెస్ విడుదల చేసింది. బీహార్ లో తన పేరుతో ప్రధాని మోదీ రాజకీయం చేస్తున్నారని తల్లి వాపోతున్నట్లుగా ఏఐ టెక్నాలజీతో వీడియోను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ తల్లి ఏఐ వీడియోపై దిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ దిల్లీ ఎలక్షన్ సెల్ కన్వీనర్ సంకేత్ గుప్తా ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఐటీ సెల్ విభాగంపై FIR నమోదు చేశారు. దిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
ప్రధాని మోదీకి ఆయన తల్లి హీరాబెన్ కలలోకి వచ్చినట్లు ఈ ఏఐ వీడియోను కాంగ్రెస్ క్రియేట్ చేసి రిలీజ్ చేసింది. 'ఈ రోజు ఓటు చోరీ పూర్తయింది. ఇక నిద్రకు ఉపక్రమించే సమయం అయింది. నోట్ల రద్దు చేసినప్పుడు లైన్ లో నిలబెట్టావు. ఇప్పుడు నా పేరు మీద బిహార్ లో రాజకీయం చేస్తున్నావు. నన్ను అవమానించేలా బ్యానర్లు, పోస్టర్లు వేయిస్తున్నావు. రాజకీయం పేరుతో దిగజారొద్దు' అని ప్రధాని మోదీకి తన తల్లి హీరాబెన్ చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది. ఈ వీడియోను బీహార్ కాంగ్రెస్ ఎక్స్ పోస్టు చేసింది.

అయితే ఈ వీడియోపై దిల్లీ ఎన్నికల విభాగం కన్వీనర్ సంకేత్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన దేశ అత్యున్నత రాజ్యాంగాన్ని అవమానించడమేనని.. ముఖ్యంగా మహిళల గౌరవాన్ని, మాతృత్వాన్ని అపహాస్యం చేయడమేనని సంకేత్ గుప్తా అన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల నుంచి తొలగించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications