ఢిల్లీ షేమ్: పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై దారుణాలు ఆగడం లేదు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ పదో తరగతి విద్యార్థినిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

మంగళవారంనాడు ఆ మేరకు వార్తలు వచ్చాయి. అయితే, సంఘటన వారం రోజుల క్రితం జరిగింది. పాఠశాలకు వెళ్తుండగా ఓ ముఠా అమ్మాయిని పట్టుకుని ఓ ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు.

Delhi shame: Class 10th student gang-raped

అత్యాచార సంఘటనను ఎంఎంఎస్ క్లిప్‌గా రూపొందించారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లని తెలుస్తోంది. ఓ వ్యక్తికి అమ్మాయికి పరిచితుడని సమాచారం.

ఐదుగురు నిందితుల్లో పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+