Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నా కోరిక తీర్చు: పిజ్జా వద్దన్న యువతితో డెలివరీ బాయ్, వేశ్యగా..!

బెంగళూరు: పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లి, దానిని నచ్చలేదని చెప్పి తిరస్కరించడంతో ఓ డెలివరీ బాయ్ ఓ మహిళను వేధింపులకు గురి చేసిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఆమె ఫోన్ నెంబర్ వాట్సాప్ గ్రూప్‌లో పెట్టి తప్పుడు ప్రచారం చేశాడు.

దీంతో, తమతో శృంగారానికి ఎంత తీసుకుంటావని ప్రశ్నిస్తూ ఆ మహిళకు వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్టడు చేశారు.

ఆర్డర్‌ చేసిన పిజ్జా తీసుకోలేదని ఓ యువతిని లైంగికంగా వేధించాడు ఓ పిజ్జా డెలివరీ బాయ్‌. తను మాత్రమే కాకుండా తన గ్యాంగ్‌ మొత్తాన్నీ ఆమె మీదకు ఉసిగొల్పాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతణ్ని అరెస్ట్‌ చేశారు.

from customer after order dispute

బెంగళూరులోని జేపీ నగర్‌కు చెందిన ఓ యువతి గత శుక్రవారం రాత్రి ఆన్‌లైన్‌ ద్వారా మెక్‌డోనాల్డ్స్‌లో ఓ పిజ్జా ఆర్డర్‌ చేసింది. రాత్రి పది గంటల సమయంలో పిజ్జా డెలివరీ బాయ్‌ దానిని తీసుకొచ్చాడు. అయితే ఆ పిజ్జా తనకు నచ్చలేదని, దానిని తిరిగి తీసుకు పోవాలని కోరింది.

ఒక్కసారి ఆర్డర్‌ దానిని తిరిగి ఇచ్చేయడం కుదరదని, డబ్బులు ఇవ్వాలని డెలివరీ బాయ్ పట్టుబట్టాడు. ఆ యువతి మాత్రం డబ్బులు ఇచ్చేది లేదని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయింది. అతను ఆ పిజ్జాను అక్కడే వదిలేశాడు. ఆమె పైన అతనికి కోపం వచ్చింది.

పది నిమిషాల తర్వాత ఆమెకు ఫోన్‌ చేసి బూతులు తిట్టాడు. అంతేకాదు, తన కోరిక తీర్చాలని డిమాండ్‌ చేశాడు. ఆమె తిట్టి ఫోన్‌ పెట్టేయడంతో, ఆ నెంబర్‌ను తన వాట్సాప్‌ గ్రూప్‌ మెంబర్లకు పంపించి, ఆమె ఒక వేశ్య అని, డబ్బులు మాట్లాడుకుని ఎంజాయ్‌ చేయండని పేర్కొన్నాడు. దీంతో ఆమెకు చాలా ఫోన్లు వచ్చాయి. ఆ రోజు రాత్రంతా బాగా ఫోన్లు వచ్చాయి. మరుసటి రోజు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+