దేశంలో డెల్టా వేరియంట్ ఆధిపత్యం కొనసాగుతోంది: కరోనా కన్సార్టియం హెచ్చరిక

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగానే అత్యధిక కేసులు, మరణాలు నమోదయ్యాయ ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చిన విషయం తెలిసిందే. అంతేగాక, ఇప్పటికీ సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతుండగా, డెల్టా వేరియంట్‌కేసులు కూడా వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనావైరస్‌ వ్యాప్తి, ఉత్పరివర్తనాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నేతృత్వంలో 28 జాతీయ ల్యాబ్‌లు కలిసి ఏర్పాటైన కన్సార్టియం(ఐఎన్ఎస్ఏసీఓజీ) కీలక విషయాలను వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కొత్త కరోనా కేసుల్లో డెల్టా వేరియంట్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయని, ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్ అధిపత్యమే ఎక్కువగా ఉందని ఐఎన్ఎస్ఏసీఓజీ తెలిపింది. అంతేగాక, డెల్టా వేరియంట్ కన్నా ఎక్కువ ఫ్రమాదకరమైన డెల్టా ఉపరకాలు ఉన్నాయనడానికి ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పస్టం చేసింది.

 Delta variant continues to be dominant in Coronavirus cases across India: INSACOG.

దేశ వ్యాప్తంగా కొత్తగా వెలుగుచూస్తున్న కరోనా కేసుల నమూనాల్లో డెల్టా వేరియంట్ ప్రభావమే ఎక్కువ కనిపిస్తోందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణకు డెల్టా వేరియంటే కారణమని వెల్లడించింది. ముఖ్యంగా ఆగ్నేసియా తోపాటు ఇతర దేశాల్లోనూ డెల్టా వేరియంట్ కేసులే ఎక్కువగా ఉన్నాయని ఐఎన్ఎస్ఏసీఓజీ పేర్కొంది. అమెరికాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ కేసులు అత్యధికంగా వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే.

మనదేశంలో డెల్టా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ లాంబ్డా కేసులు మాత్రం వెలుగుచూడలేదని ఐఎన్ఎస్ఏసీఓజీ తెలిపింది. బ్రిటన్‌లో ఈ రకం వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతోందని చెప్పింది. కాగా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా బారినపడుతున్న వారిలోనూ డెల్టా రకమే అధికంగా ఉన్నట్లు ఐసీఎంఆర్ అధ్యయనం వెల్లడించింది. అయితే, పాజిటివ్ వచ్చినప్పటికీ డెల్టా వేరియంట్‌తో 9.8 శాతం కేసుల్లోనే ఆస్పత్రిలో చేరాల్సి వస్తోంది. మరణాల రేటు కూడా కేవలం 0.4 శాతానికే పరిమితమైందని ఐసీఎంఆర్ నివేదిక తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+