బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Former CM: బెయిల్ కోసం కోర్టుకు వెళ్లిన మాజీ సీఎం, డీనోటిఫికేషన్ కేసు, వాసుదేవరెడ్డి దెబ్బతో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి డీ నోటిఫికేషన్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టును ఆశ్రయించారు. చాలా సంవత్సరాల క్రితం జరిగిన డీ నోటిఫికేషన్ దెబ్బతో అప్పుడే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే చాలా సంవత్సరాల తరువాత మాజీ ముఖ్యమంత్రి స్వయంగా కోర్టుకు హాజరై డీ నోటిఫికేషన్ కు సంబంధించిన కేసులో తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టుకు మనవి చేశారు. మాజీ సీఎంకు బెయిల్ మంజూరు చేసే విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అఫిడవిట్ దాఖలు చెయ్యడానికి సమయం కావాలని పిటిషనర్ల తరుపు న్యాయవాది కోర్టుకు మనవి చేశారు. ఇప్పటికే ఈ అక్రమ డీ నోటిఫికేషన్ కేసు విచారణ నుంచి కొందరు తప్పించుకున్నారు. అయితే మాజీ సీఎంకు మాత్రం అక్రమ డీ నోటిఫికేషన్ కేసు నుంచి విముక్తి చిక్కలేదు.

Illegal affair: ప్రియుడి మోజులో పడిన భార్య, భర్తకు చిన్నగాయం కాకుండా నిద్రలోనే చంపేసిన భార్య, స్కెచ్ !Illegal affair: ప్రియుడి మోజులో పడిన భార్య, భర్తకు చిన్నగాయం కాకుండా నిద్రలోనే చంపేసిన భార్య, స్కెచ్ !

 సీఎం హోదాలో డీ నోటిఫికేషన్

సీఎం హోదాలో డీ నోటిఫికేషన్

కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెంగళూరులో ఐటీ కారిడార్ నిర్మాణం కోసం బెళ్లందరూర్, దేవర బీసనహళ్లిలో 15 ఎకరాల 30 గుంటల భూమిని డీ నోటిఫికేషన్ చేశారు. ఆ సమయంలో బీఎస్. యడియూరప్ప ప్రభుత్వ నియమాలు పక్కన పెట్టి సీఎం హోదాలో అక్రమంగా డీ నోటిఫికేషన్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

 కోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి

కోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి

సీఎం హోదాలో బీఎస్. యడియూరప్ప అక్రమంగా డీ నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపిస్తూ 2013లో వాసుదేవరెడ్డి అనే ఆయన బెంగళూరు మెజస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. బీఎస్. యడియూరప్పతో పాటు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత ఆర్.వీ. దేశ్ పాండ్ తదితరులు ఈ కేసులో ఉన్నారు.

 కేసు దెబ్బతో సీఎం పదవి పోయింది

కేసు దెబ్బతో సీఎం పదవి పోయింది

అక్రమ డీనోటిఫికేషన్ వివాదంలో చిక్కుకున్న బీఎస్. యడియూరప్ప అప్పట్లో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. తరువాత బెయిల్ తీసుకున్న యడియూరప్ప కేసు విచారణ ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆర్ వీ. దేశ్ పాండే మీద వచ్చిన ఆరోపణలను 2015లో హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో కొందరు విచారణ నుంచి విముక్తిపొందారు.

 బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం

బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం

ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి బెంగళూరులో డీనోటిఫికేషన్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని శుక్రవారం బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప స్వయంగా కోర్టుకు హాజరై డీ నోటిఫికేషన్ కు సంబంధించిన కేసులో తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టుకు మనవి చేశారు.

 రేపటికి బెయిల్ పిటీషన్ విచారణ వాయిదా

రేపటికి బెయిల్ పిటీషన్ విచారణ వాయిదా

మాజీ సీఎం బీఎస్. యడియూరప్పకు బెయిల్ మంజూరు చేసే విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అఫిడవిట్ దాఖలు చెయ్యడానికి సమయం కావాలని పిటిషనర్ల తరుపు న్యాయవాది కోర్టుకు మనవి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి శనివారానికి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేశారు. ఇప్పటికే ఈ అక్రమ డీ నోటిఫికేషన్ కేసు విచారణ నుంచి కొందరు తప్పించుకున్నారు. అయితే మాజీ సీఎం బీఎస్. యడియూరప్పకు మాత్రం అక్రమ డీ నోటిఫికేషన్ కేసు నుంచి విముక్తి చిక్కలేదు.

English summary
Denotification case: Karnataka former CM BS Yediyurappa bail plea filed to city civil court in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X