డేరా చీఫ్‌కు జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత.. పెరోల్‌పై గుర్మీత్, ప్రొటెక్షన్ ఎందుకు పెంచారంటే..

డేరా సచ్చా సౌదా ఛీప్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు హర్యానా భద్రతను పెంచింది. ఆయనకు జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతను కల్పిస్తోంది. ఖలిస్థాన్ అనుకూల కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మాజీ జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య, ఇద్దరు డేరా శిష్యులపై అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. అయితే ఆయన ఫిబ్రవరి 7న పెరోలుపై విడుదల అయ్యారు. రోహ్‌తక్‌లోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన 21 రోజుల పాటు బయట ఉంటారు.

జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత

జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత


డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ జైలు బయట ఉన్న సమయంలో హర్యానా ప్రభుత్వం అతనికి జెడ్ ప్లస్ భద్రతను కల్పించింది. డేరాబాబాకు అత్యున్నత స్థాయి భద్రత ఇవ్వనుంది. 2017లో పంచకులలోని ప్రత్యేక సీబీఐ కోర్టు డేరాబాబాను దోషిగా నిర్ధారించింది. భద్రతా ఏజెన్సీ నిర్వహించే సమగ్ర ముప్పు అంచనా ఆధారంగా ప్రభుత్వం ఒక వ్యక్తికి భద్రతను కల్పిస్తోంది. జడ్-ప్లస్ కేటగిరీలోని వ్యక్తులు మొబైల్ భద్రత కోసం 10 మంది భద్రతా సిబ్బందిని, నివాస భద్రత కోసం పది మంది సిబ్బందిని నియమించారు. జడ్ ప్లస్ స్థాయి భద్రతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు అందించనున్నారు.

 ఏడేళ్ల వయసులోనే ఆశ్రమానికి..

ఏడేళ్ల వయసులోనే ఆశ్రమానికి..

డేరా సచ్చా సౌదాది రాజస్తాన్‌ గంగానగర్‌ జిల్లాలోని శ్రీ గురుసార్‌ మోడియా గ్రామం. రైతు మఘర్‌ సింగ్, నసీబ్‌ కౌర్‌ల ఏకైక సంతానం ఈయప. 1967 ఆగస్టు 15న గుర్మీత్‌ జన్మించారు. డేరా సచ్చా సౌదా మతగురువు షా సత్నామ్‌... గుర్మీత్‌ను ఏడేళ్ల వయసులోనే తనతో తీసుకెళ్లి సచ్చా సౌదాలో చేర్పించారు. పేరును గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌గా మార్చారు. గుర్మీత్‌కు 23 ఏళ్ల వయసు ఉన్న సమయంలో మత గురువు హోదాను ప్రసాదించి సెప్టెంబర్‌ 23, 1990లో తన వారసుడిగా ప్రకటించారు. గుర్మీత్‌కు భార్య హర్‌జీత్‌ కౌర్, కొడుకు జస్మీత్, కూతుళ్లు చరణ్‌ప్రీత్, అమర్‌ప్రీత్‌ ఉన్నారు. హనీప్రీత్‌ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. హనీప్రీత్‌ పంజాబీ సినీనటి, దర్శకురాలు.

Recommended Video

    డేరాబాబా బెడ్ రూంలో నగ్నంగా తిరుగుతూ వీడియో తీయించిన హనీప్రీత్? | Oneindia Telugu
    దాడి.. అయినా సేఫ్

    దాడి.. అయినా సేఫ్


    మనోభావాలను దెబ్బతీశాడని రగిలిపోయిన సిక్కు యువకులు 2007 జూలై 16న గుర్మీత్‌పై దాడి చేశారు. దీని నుంచి బయటపడ్డారు. 2008లో ఆయన కాన్వాయ్‌పై బాంబుదాడి జరిగింది. ఇందులో గుర్మీత్‌కు ఏమీ కానప్పటికీ 11 మంది అనుయాయులు గాయపడ్డారు. దీంతో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనకు జడ్‌ ప్లస్‌ భద్రతను కల్పించింది. జడ్‌ ప్లస్‌లో 36 మంది సుశిక్షితులైన కమాండోలను భద్రత నిమిత్తం కేటాయిస్తారు. ఇప్పుడు ఆ భద్రత పెరిగి.. జెడ్ ప్లస్ క్యాటగిరీ ఇవ్వనున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+