దేవదాసి వ్యవస్థ: ఏపీ, తమిళనాడులకు నోటీసులు

సామాజిక దురాచారమైన దేవదాసి వ్యవస్థ కొనసాగుతుందన్న ఆరోపణలపై తమిళనాడు, ఏపీలకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది.

అమరావతి/చెన్నై: సామాజిక దురాచారమైన దేవదాసి వ్యవస్థ కొనసాగుతుందన్న ఆరోపణలపై తమిళనాడు, ఏపీలకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది.

తమిళనాడు తిరువల్లూరు జిల్లాలో మాతమ్మతల్లి దేవాలయానికి తీసుకెళ్లి బాలికలు, మహిళలను బలవంతంగా దేవదాసీలుగా మారుస్తున్నారని వచ్చిన ఫిర్యాదులు, మీడియాలో వార్తల ఆధారంగా నోటీసులు జారీ చేసినట్టు కమిషన్ వెల్లడించింది.

Devadasi practice still haunts Tamil Nadu, Andhra; NHRC issues notices

తమిళనాడు, ఆంధ్రలో మహిళలను దేవదాసీలుగా మారుస్తున్నారన్న ఆరోపణలు నిజమైతే ఆది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని కమిషన్ పేర్కొంది. ఇది విద్యా, బాలల హక్కుల హరించినట్లేనని కమిషన్ స్పష్టం చేసింది.

దీనిపై తమిళనాడు, ఏపీ డిజిపిలకు తమిళనాడు (తిరువళ్లూరు), ఆంధ్ర (చిత్తూరు) జిల్లా మెజిస్ట్రేట్‌లు ఎస్పీలకు నోటిసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల్లో సమయం ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+