కేంద్రం ఆఫర్‌కు ‘నో’.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ ఇదే!
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత వారం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనలు జరుగుతున్న తరుణంలో.. ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిత్వ శాఖను మార్చాలని కేంద్రం సీజేపీకి ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ఈ ఆఫర్‌ను కాక్రోచ్ జనతా పార్టీ నిరభ్యంతరంగా తిరస్కరించినట్లు సమాచారం. ఢిల్లీలో నిరసనలు తీవ్రరూపం దాల్చిన సమయంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు జులై 20న సీజేపీ ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాతో మొదటి విడత చర్చలు జరిపారు. పార్లమెంట్ ముట్టడి పిలుపు నేపథ్యంలో వీధుల్లో ఆందోళనకారులపై పోలీసులు దాడికి పాల్పడిన సమయంలోనే ఈ కీలక చర్చలు జరిగాయి.
కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలకు ముగింపు పలికేందుకు ధర్మేంద్ర ప్రధాన్ ను విద్యాశాఖ నుంచి వేరే మంత్రిత్వ శాఖకు బదిలీ చేస్తామని కేంద్రం ఆఫర్ చేయగా.. సీజేపీ ప్రతినిధులు దానికి ససేమిరా అంగీకరించలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాకుండా వేరే విషయాలకు అంగీకరిస్తే నిరసనకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని కాక్రోచ్ జనతా పార్టీ భావించింది. ఓ మంత్రిని తొలగించడం లేదా ఫోర్ట్ ఫోలియోను మార్చడం ప్రధాని విచక్షణాధికారమని కేంద్ర మంత్రులు సీజేపీకి నచ్చజెప్పినప్పటికీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టింది. విపక్ష నేత రాహుల్ గాంఘీ కూడా కేవలం శాఖ మార్పుతో విద్యార్థులు లేదా విపక్షాలు సంతృప్తి చెందవని.. ఆయన రాజీనామా చేయాల్సిందేనని అన్నారు.

దీంతో సీజేపీ, కేంద్ర మంత్రుల మధ్య మూడో విడత చర్చలకు కొన్ని గంటల ముందు, శనివారం మధ్యాహ్నం ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సీజేపీ తన నిరసనను విరమించుకుంది.పరీక్షా పత్రాల లీకేజీపై జరుగుతున్న ఆందోళనను దేశ వ్యతిరేక శక్తులు వాడుకోకుండా అడ్డుకోవడానికే తాను పదవి నుంచి తప్పుకున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications