పాక్: మోడీకి శివసేన సూచన, మోడీపై రాజే అసంతృప్తి
న్యూఢిల్లీ/ముంబై: దాయాది పాకిస్తాన్ పైన శివసేన స్పందించింది. నరేంద్ర మోడీ తన ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిపై శివసేన అధినేత ఉద్దవ్ థాకరే స్పందించారు. మోడీ ప్రధానిగా అధికారం చేపట్టనుండడంతో మంచి రోజులు రానున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
కాశ్మీర్లోనూ, దేశవ్యాప్తంగానూ శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. పాక్‌ను నమ్మడం కష్టమని అభిప్రాయపడ్డారు. కానీ, మోడీ నాయకత్వంపై తనకు నమ్మకం ఉందన్నారు. ఆయనకు ఇబ్బందులు కలిగించాలని అనుకోవడం లేదన్నారు. పాకిస్థాన్ తన విధానాన్ని మార్చుకోకపోతే మోడీ అణు బటన్ (అణు క్షిపణులను ప్రయోగించడమని ఆయన ఉద్దేశం) నొక్కాలన్నారు.

యూపి, బీహార్, మహారాష్ట్రలకు పెద్ద పీట
మోడీ తన కేబినెట్లో ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలకు పెద్ద పీట వేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో బిజెపి యూపిలో అంచనాలకు మించిన సీట్లను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో యూపికి పీట వేశారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలకు బెర్త్ దక్కలేదు. రాజస్థాన్‌లోని 26 లోకసభ స్థానాలకు 26 బిజెపి గెలుచుకవడం గమనార్హం. రాజస్థాన్‌కు కేబినెట్లో చోటు కల్పించక పోవడంపై వసుంధరా రాజే అసంతృప్తితో ఉన్నారు.












Click it and Unblock the Notifications