రెండ్రోజులు కాస్త ఓపిక పట్టండి: కిరణ్‌పై టి నేతలకు డిగ్గీ

రాజ్యసభ ఎన్నికలు జరిగే శుక్రవారం వరకూ సంయమనం పాటించాలని, తర్వాత అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. వాస్తవానికి తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చాక అధిష్ఠానం మూడు ప్రత్యామ్నాయాలను ఆలోచించిందని, అందులో ముఖ్యమంత్రి కిరణ్‌ను మార్చి ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని అనుకున్నామని, అయితే ఈ సమయంలో మార్పు చేయడం సరైనదేనా అని ఆలోచించామని, రాష్ట్రపతి పాలన విధించాలని అనుకున్నామని, సొంత పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రాష్ట్రపతి పాలన విధించడం విమర్శలకు దారి తీస్తుందని దానిపై వెనక్కు తగ్గామని, కిరణ్‌ను కొనసాగించి ఆయన హయాంలోనే తెలంగాణ ఇవ్వడం మూడో దారిగా ఆలోచించామన్నారు. చివరి దానికే ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు.
బుధవారం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, జానారెడ్డి, డికె అరుణ, గీతా రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తదితరులు దిగ్విజయ్‌ను కలిశారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఢిల్లీ వచ్చి ధర్నా చేయడమేమిటని ఆక్రోశించారు. సీమాంధ్ర నేతలు ఎలా వ్యవహరించినా మీరు స్పందించవద్దని వారికి డిగ్గీ సూచించారు. తాము సంయమనంతోనే వ్యవహరిన్నప్పటికీ, కవ్వింపు ధోరణిని ప్రదర్శిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications