పాదాల చెంత మోదీ.. షాకింగ్ ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ నేత! రాజకీయాల్లో కొత్త చిచ్చు!!

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా బీజేపీ పేరు చెబితేనే విరుచుకుపడే ఆయన.. ఒక్కసారిగా ప్లేట్ మార్చారు. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ పాత ఫోటోను షేర్ చేస్తూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలాన్ని ఆకాశానికెత్తారు. ఈ పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది.

నేల మీద కూర్చున్న మోదీ.. దిగ్విజయ్ ప్రశంసలు
దిగ్విజయ్ సింగ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో Quora వెబ్‌సైట్‌కు సంబంధించిన ఒక స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేశారు. 1990వ దశకంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా ప్రమాణ స్వీకార కార్యక్రమ సమయంలో తీసిన ఫోటో అది. ఆ ఫోటోలో బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీ సోఫాలో కూర్చుని ఉండగా.. అప్పట్లో ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న నరేంద్ర మోదీ ఆయన పాదాల చెంత కింద నేల మీద కూర్చుని ఉన్నారు. ఆ ఫోటోను ఉద్దేశించి దిగ్విజయ్ ఈ విధంగా రాసుకొచ్చారు. "ఈ ఫోటో చాలా ప్రభావవంతంగా ఉంది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలో ఒక సాధారణ కార్యకర్త నేల మీద కూర్చునే స్థాయి నుండి ముఖ్యమంత్రిగా, ఆపై దేశ ప్రధానిగా ఎలా ఎదిగారో చూడండి. ఇది ఆ సంస్థ యొక్క క్రమశిక్షణ మరియు శక్తికి నిదర్శనం. జై సియా రామ్" అంటూ ఆయన రాసుకొచ్చారు.

Digvijaya Singh Shares Shocking Photo of Modi Sparks Fresh Political Storm

హైకమాండ్‌కు చురకలు.. రాహుల్‌కు ట్యాగ్!
ఈ పోస్ట్‌ను దిగ్విజయ్ సింగ్ కేవలం బీజేపీని పొగడడానికే పరిమితం చేయలేదు. దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేష్‌లను ట్యాగ్ చేశారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి కార్యకర్తలకు సరైన గుర్తింపు దక్కడం లేదని, అంతా 'హైకమాండ్' చుట్టూనే తిరుగుతోందని ఆయన పరోక్షంగా విమర్శించారు. బీజేపీలో ఒక సాధారణ కార్యకర్త కూడా అత్యున్నత స్థాయికి చేరుకోగలరనే విషయాన్ని తన పార్టీ నాయకత్వానికి గుర్తు చేస్తూ ఆయన ఈ 'మైండ్ గేమ్' ఆడారని భావిస్తున్నారు.

బీజేపీ ఎదురుదాడి: "గాంధీ కుటుంబం నియంతృత్వానికి ఇది నిదర్శనం"
దిగ్విజయ్ సింగ్ పోస్ట్‌ను బీజేపీ ఆయుధంగా మార్చుకుంది. బీజేపీ ప్రతినిధి సీఆర్ కేశవన్ స్పందిస్తూ.. "దిగ్విజయ్ సింగ్ నిజం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక కుటుంబం (గాంధీ కుటుంబం) చుట్టూనే తిరుగుతుంది. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, కేవలం నియంతృత్వం మాత్రమే ఉంది. కానీ బీజేపీలో కింది స్థాయి కార్యకర్త కూడా ప్రధాని కాగలడు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలే అంగీకరిస్తున్నారు" అంటూ ఎద్దేవా చేశారు.

వెనక్కి తగ్గిన దిగ్విజయ్.. వివరణ ఇదే!
ఈ పోస్ట్ వల్ల పార్టీలో తనపై వ్యతిరేకత వస్తుందని గ్రహించిన దిగ్విజయ్ సింగ్ వెంటనే వివరణ ఇచ్చారు. "నేను మోదీ విధానాలకు, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి వ్యతిరేకమని అందరికీ తెలుసు. నేను కేవలం వారి సంస్థాగత నిర్మాణం, కార్యకర్తలకు ఇచ్చే ప్రాధాన్యతను మాత్రమే మెచ్చుకున్నాను. ఇందులో రాజకీయ అర్థాలు వెతకవద్దు" అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+