జయలలిత మృతిపై విచారణకు శశికళ సిద్దం, జైల్లో దినకరన్ భేటీ, ఏం చెయ్యాలో తెలుసు !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ ఎదుర్కోవడానికి శశికళ సిద్దంగా ఉన్నారని ఆమె సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ అన్నారు. శుక్రవారం బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళను టీటీవీ దినక

బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ ఎదుర్కోవడానికి శశికళ సిద్దంగా ఉన్నారని ఆమె సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ అన్నారు. శుక్రవారం బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళను టీటీవీ దినకరన్ ములాఖత్ లో కలిశారు.

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళతో భేటీ అయిన తరువాత దినకరన్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. జయలలిత మృతిపై విచారణకు ప్రత్యేక కమిటీ వేస్తున్నారని చిన్నమ్మ శశికళకు చెప్పానని దినకరన్ స్పష్టం చేశారు.

Dinakaran comments on unification AIADMK factions articleconten

జయలలిత అనారోగ్యంతోనే చనిపోయారని, ఎలాంటి విచారణ కమిటీ వేసినా భయం లేదని, మీరు ధైర్యంగా ఉండాలని, తాను విచారణ ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నానని శశికళ చెప్పారని దినకరన్ వివరించారు. పోయెస్ గార్డెన్ తో పాటు జయలలిత ఆస్తుల విషయంలో స్పంధించడానికి దినకరన్ నిరాకరించారు.

అన్నాడీఎంకే పార్టీని తన చేతుల్లోకి ఎలా తీసుకోవాలని అని చిన్నమ్మ చెప్పారని ఇక ఆదిశగా ముందుకు వెలుతానని దినకరన్ అన్నారు. అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) కమిటీ సభ్యులతో మాట్లాడిన తరువాత తమిళనాడు ప్రభుత్వం మీద తాను తగిన చర్యలు తీసుకుంటానని దినకరన్ వివరించారు.

త్వరలోనే తమిళనాడులో పలు మార్పులు జరుగుతాయని, మీరు కూడా వేచి చూడాలని దినరన్ మీడియాతో అన్నారు. ఓ వైపు తమిళనాడు సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం ఒక్కటి అవుతున్న సందర్బంలో ఏ ధైర్యం చూసుకుని టీటీవీ దినకరన్ ఇలా మాట్లాడుతున్నారో అర్థం కాకపోవడంతో ఆయన వర్గీయులు ఆయోమయంలో పడిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+