బెంగళూరు ప్రజలకు ఏడాదికి తాగునీళ్లు ఎంత కావాలంటే ?, పక్కాక్లారిటీ ఇచ్చిన డీసీఎం, అదీలెక్క !

బెంగళూరు/న్యూఢిల్లీ: బెంగళూరు సిటీతో పాటు పరిసర ప్రాంతాలలో తాగునీటి అవసరాల కోసం ఏటా 24 టీఎంసీల కావేరీ నీటిని రిజర్వ్ చేయాలని ఆదేశాలు జారీ చేశామని, ఈ విషయంలో అలర్ట్ గా ఉండాలని బీడబ్ల్యూఎస్ఎస్ బీ (BWSSB) అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.

బుధవారం ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో డీసీఎం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ బెంగళూరులో తాగునీటి అవసరాలకు 24 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని 2018లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇంతకుముందు తక్కువ నీరు కర్ణాటక ఉపయోగించుకుందని డీకే శివకుమార్ అన్నారు.

DK Shivakumar said that 24 TMC of Cauvery water will be used for the people of Bengaluru

ఇప్పుడు మిగిలిన 6 టీఎంసీల నీటిని ఉపయోగించి, బెంగళూరు మొత్తం తాగునీటి అవసరాలకు 24 టీఎంసీలను వినియోగించుకోవాలని నిర్ణయించామని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ 89వ సమావేశంలో మేకేదాటు డ్యామ్ అంశాన్ని రాష్ట్ర అధికారులు ప్రతిపాదించారని డీకే శివకుమార్ అన్నారు.

మేకదాటు ప్రాజెక్టు అశంపై సమవేశంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. మేకేదాటు పథకం ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని అధికారులకు, సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నామని డీకే శివకుమార్ చెప్పారు. ఈ మేకదాటు ప్రాజెక్ట్ ఆపద సమయంలో నీటిని నిల్వ చేసుకోవడానికి సహాయపడుతుందని, ఈ ప్రాజెక్ట్ వలన తమిళనాడు మరింత ప్రయోజనం పొందుతుందని డీకే శివకుమార్ అన్నారు.

DK Shivakumar said that 24 TMC of Cauvery water will be used for the people of Bengaluru

కావేరిలో ఎంత నీరు మిగిలి ఉంది, ఎంత ప్రవహిస్తోంది, ఎంతమేరకు వినియోగిస్తున్నారు తదితర పూర్తి సమాచారాన్ని అధికార యంత్రాంగం ముందు కర్ణాటక అధికారులు వివరించారని, కష్టకాలంలోనైనా 300-400 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తమిళనాడు డిమాండ్ చేసిందని డీకే శివకుమార్ అన్నారు. కేఆర్‌ఎస్‌కు ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయిందని, ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నామని డీకే శివకుమార్ అన్నారు.

బెంగుళూరుకు 24 టీఎంసీల నీటి వినియోగంపై తమిళనాడు అభ్యంతరం చెబుతుందని, బెంగళూరు ప్రజల తాగునీటికే మా మొదటి ప్రాధాన్యత ఉంటుందని, మేము సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నామని డీకే శివకుమార్ చెప్పారు. తమిళనాడు ఏమైనా అభ్యంతరం చెప్పినా మేము పట్టించుకోమని, మా హక్కులను మేము ఎందుకు వదులుకోవాలని అని డీకే శివకుమార్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+