కావేరి నీటి సమస్యకు మేకదాటు ఒక్కటే పరిష్కారం, బెంగళూరుకు, డీకే !

బెంగళూరు/చెన్నై: కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ నదీ జలాల పంపిణీ సమస్యకు మేకేదాటు ప్రాజెక్టు ఒక్కటే పరిష్కారం. దీనిపై సుప్రీంకోర్టుకు తెలియజేశాం అని కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి, డీసీఎం డీకే శివకుమార్‌ తెలిపారు. బెంగళూరు నగరంలోని సదాశివనగర్ నివాసంలో డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు.

కావేరీ నదీ జలాల విడుదల అంశంపై సుప్రీంకోర్టు, కావేరీ నదీ జలాల నిర్వహణ అథారిటీ ద్వారానే విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. ప్రస్తుతానికి సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలి. ఈ పరిస్థితిలో ప్రధాన పరిష్కారం మేకదాటు డ్యామ్ నిర్మించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని డీకే శివకుమార్ అన్నారు.

DK Sivakumar

మేకదాటు డ్యామ్ నిర్మించి ఉంటే ఈరోజు ఈ సమస్య, పరిస్థితి వచ్చేది కాదు. గతేడాది 400 టీఎంసీలకు పైగా నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయింది. మేకదాటు డ్యామ్‌ ద్వారా కొద్దిపాటి నీరు నిలిచి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. మేకదాటు డ్యామ్ నీటిని సాగునీటికి ఉపయోగించుకోలేకపోతున్నాం. త్రాగునీటికి మాత్రమే ఉపయోగించవచ్చు. ఇలాంటి కష్ట సమయాల్లో మేకదాటు డ్యామ్ ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని డీకే శివకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మేకదాటు డ్యామ్ నిర్మించే విషయాన్ని మేము సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని, మేకదాటు డ్యామ్ నిర్మాణం విషయంలో మన రాష్ట్రంలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామని, మా ప్రభుత్వం సుప్రీమ్ కోర్టుకు పూర్తి సమాచారం ఇచ్చిందని, కర్ణాటక రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడటానికి మేము కట్టుబడి ఉన్నామని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు.

తమిళనాడు తన వాటా కావేరి నీటిని ఏ పనికైనా ఉపయోగించుకోవచ్చు. దానిని మనం ప్రశ్నించలేము. అయితే తమిళనాడు సంక్షోభ సమయంలో ఈ నీటిని జాగ్రత్తగా వాడుకోవచ్చు. మన రైతులకు మనం పంటలు వెయ్యకూడదని చెప్పినట్లే తమిళనాడు ప్భుత్వం కూడా ఆ రాష్ట్రంలోని రైతులకు సలహా ఇవ్వాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.

DK Sivakumar

మండ్యలో బీజేపీ మద్దతుతో రాజకీయ ప్రయత్నాలపై వ్యతిరేకత మినహా రాష్ట్రంలోని రైతులు ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయలేదని, తమిళనాడుకు నీరు విడుదల చేయవద్దని చెబుతున్నారే తప్పా నష్టపోయామని ఎవరూ అనడం లేదని, ఎందుకంటే మన రైతులకు అవసరమైన సమయంలో నీరు ఇచ్చి ఆదుకోవడానికి మేము సిద్దంగా ఉన్నామని డీకే శివకుమార్ అన్నారు.

ఈ సమయంలో పంట వేయవద్దని మన మంత్రి రైతులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. నీటి విడుదల అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కావేరి నీటి సమస్య పరిష్కారానికి మేకదాటు డ్యామ్ నిర్మాణం ఒక్కటే పరిష్కారమని మేము సుప్రీంకోర్టుకు, తమిళనాడుకు చెప్పాలనుకుంటున్నామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+