Fake : జీఎస్టీ రీఫండ్ పేరుతో మెసేజ్‌లు.. ఆ లింకుపై క్లిక్ చేయవద్దు..
కరోనా వ్యాప్తిని నియంత్రించడం కంటే ఫేక్ న్యూస్‌ను నియంత్రించడం పెద్ద సవాల్‌గా మారింది. తాజాగా జీఎస్టీ రీఫండ్‌కి సంబంధించిన ఓ ఫేక్ మెసేజ్ పుట్టుకొచ్చింది. కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో జీఎస్టీ రీఫండ్‌కి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టిందనేది దాని సారాంశం. అంతేకాదు,అదే మెసేజ్‌లో ఓ లింకును కూడా పొందుపరిచారు. దానిపై క్లిక్ చేసి రీఫండ్‌ను పొందాలని సూచిస్తున్నారు.
అయితే ఇదంతా ఫేక్ అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ & కస్టమ్స్(CBIC) స్పష్టం చేసింది.ట్యాక్స్ చెల్లింపుదారులు ఇలాంటి మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. తొందరపడి ఆ లింకులను క్లిక్ చేయవద్దని సూచించింది. ఇవి తప్పుదోవ పట్టించే మెసేజ్‌లు అని,సీబీఐసీతో వీటికి ఏమాత్రం సంబంధం లేదని తెలిపింది. జీఎస్టీ ఫైలింగ్స్ కోసం get.gov ను సంప్రదించాలని చెప్పింది.

కాగా, కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రూ.5లక్షల వరకు రీఫండ్‌ను జారీ చేస్తోంది. దీంతో సుమారు 14 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందంటున్నారు. అలాగే అన్ని జీఎస్టీ, కస్టమ్ రీఫండ్స్‌ను వెంటనే రిలీజ్ చేయనున్నట్టు గతంలో ఐటీ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications