Doute: అత్తను చంపిన అల్లుడు, అల్లుడిని గొడ్డలితో నరికి చంపిన మామ, అత్త చేసిన పనితో లేనిపోని !

జార్ఖండ్/ చెన్నై: ప్రశాంతంగా రెండు కాపురాలు ఎలాంటి సమస్యలు లేకుండా సాగిపోతున్నాయి. రెండు కుటుంబాలు రక్త సంబంధం కావడంతో కలిసి పండుగలు, శుభకార్యాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో అత్త వలనే తనకు సమస్యలు వస్తున్నాయని అల్లుడికి అనుమానం మొదలైయ్యింది. అల్లుడి సంసారంలో గొడవలు, సమస్యలు మొదలైనాయి. తన కాపురంలో సమస్యలు మొదలు కావడానికి, తాను ఆర్థికంగా నష్టపోవడానికి, తమ కుటుంబ సభ్యులు ఆనారోగ్యానికి కారణం తన అత్తా అని అల్లుడు అనుమానం పెంచుకున్నాడు. అత్తతో గొడవ పెట్టుకున్న అల్లుడు ఆమెను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. శవం కూడా బయటకు తియ్యక ముందే విషయం తెలుసుకున్న మామ తన భార్యను చంపేశాడని కోపంతో అల్లుడిని గొడ్డలితో దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

అత్తా, అల్లుడి కాపురాలు

అత్తా, అల్లుడి కాపురాలు


జార్ఖండ్ లోని కుమ్లా జిల్లాలో బిన్సారి దేవి (55), మాంగ్లేవ్ ముండా దంపతులు నివాసం ఉంటున్నారు. బిన్సారి దేవి నివాసం ఉంటున్న ప్రాంతంలోనే బిన్సాలి దేవి అల్లుడు రాజ్ పాల్ ముండా (24) అనే యువకుడు అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. కొంత కాలం క్రితం వరకు భార్యతో కలిసి రాజ్ పాల్ సంతోషంగా కాపురం చేసేవాడు.

రక్తసంబంధం

రక్తసంబంధం

బిన్సాలి దేవి, రాజ్ పాల్ కుటుంబాలు రక్తసంబంధం కలిగి ఉండటంతో ఇంతకాలం రెండు కుటుంబాలు అన్యోన్యంగా కలిసిమెలసి ఉంటున్నాయి. ప్రశాంతంగా బిన్సాలి దేవి, రాజ్ పాల్ కాపురాలు ఎలాంటి సమస్యలు లేకుండా కొంతకాలం క్రితం వరకు సాగిపోయాయి. రెండు కుటుంబాలు రక్త సంబంధం కావడంతో కలిసి పండుగలు, శుభకార్యాలు చేసుకుంటున్నారు.

అల్లుడి కాపురంలో సమస్యలు

అల్లుడి కాపురంలో సమస్యలు


బిన్సాలి దేవి క్షుద్ర పూజలు, చేతబడులు చేస్తోందని ప్రచారంలో ఉంది. ఇదే సమయంలో అత్త బిన్సాలి దేవి క్షుద్రపూజల వలనే తనకు సమస్యలు వస్తున్నాయని అల్లుడు రాజ్ పాల్ కు అనుమానం మొదలైయ్యింది. అల్లుడ రాజ్ పాల్ సంసారంలో గొడవలు, సమస్యలు మొదలైనాయి. ఇటీవల రాజ్ పాల్ కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారని సమాచారం. తన కాపురంలో సమస్యలు మొదలు కావడానికి, తాను ఆర్థికంగా నష్టపోవడానికి కారణం తన అత్త బిన్సాలి దేవి అని అల్లుడు రాజ్ పాల్ అనుమానం పెంచుకున్నాడు.

 అత్త చేతబడి చేసిందని అల్లుడికి అనుమానం

అత్త చేతబడి చేసిందని అల్లుడికి అనుమానం

నువ్వు మా కుటుంబ సభ్యుల మీద చేతబడి చేశావని, అందుకే మాకు లేనిపోని సమస్యలు వస్తున్నాయని అల్లుడు రాజ్ పాల్ అతని అత్త బిన్సాలి దేవితో కొంతకాలంగా గొడవ పడుతున్నాడు. ఇదే విషయంలో అత్తా, అల్లుడి విషయంలో గ్రామ పెద్దలు పంచాయితీలు చేశారు. అయినా అల్లుడు రాజ్ పాల్ కు మాత్రం అనుమానం అలాగే ఉండిపోయింది.

అత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు

అత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు


మామ మాంగ్లేవ్ ముండా వ్యవసాయ పొలం దగ్గరకు వెళ్లిన సమయంలో ఆయన ఇంటి దగ్గరకు అల్లుడు రాజ్ పాల్ వెళ్లాడు. తరువాత అత్త బిన్సాలి దేవితో గొడవ పెట్టుకున్న అల్లుడు రాజ్ పాల్ ఆమెను గొడ్డలితో నరికేశాడు. రాజ్ పాల్ గొడ్డలితో నరకడంతో ఆమె ప్రాణాలు అక్కడే గాలిలో కలిసిపోయాయి.

అల్లుడిని నరికి చంపేసిన మామ

అల్లుడిని నరికి చంపేసిన మామ

వ్యవసాయ పొలం దగ్గర ఉన్న మాంగ్లేవ్ కు నీ భార్యను చంపేశారని గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. ఇంటికి వెళ్లిన మాంగ్లేవ్ అతని అల్లుడు రాజ్ పాల్ ను పిలిచి ఎందుకు చంపావు అని నిలదీశాడు. నీ భార్య చేతబడి చెయ్యడం వలనే మా కాపురం కూలిపోయిందని రాజ్ పాల్ గొడవకు దిగాడు. మాటా మాటా పెరిగిపోవడంతో మాంగ్లేవ్ ఇంటిలో ఉన్న గొడ్డలి తీసుకుని అల్లుడు రాజ్ పాల్ ను నరికి చంపేశాడు. ఒకే ఇంటిలో ఇద్దరు దారుణ హత్యకు గురి కావడంతో ఆ గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+