ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు, జేఎన్‌యూ విద్యార్థికి కూడా
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు గడ్జిరౌలి కోర్టు జీవిత ఖైదు విధించింది. మావోయిస్టులతో లింకులు ఉన్నాయనే ఆరోపణలు అతని పైన ఉన్న విషయం తెలిసిందే.
ఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు గడ్జిరౌలి కోర్టు జీవిత ఖైదు విధించింది. మావోయిస్టులతో లింకులు ఉన్నాయనే ఆరోపణలు అతని పైన ఉన్న విషయం తెలిసిందే.
సాయిబాబాతో పాటు ఓ జేఎన్‌యూ విద్యార్థి, మరో ముగ్గురిని జిల్లా న్యాయస్థానం నేరస్తులుగా గుర్తించింది. వారికి శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో అతనిని పోలీసులు మళ్లీ అరెస్టు చేయనున్నారు.

దీనిపై సాయిబాబా, ఇతరులు అప్పీలుకు వెళ్లవచ్చు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో సాయిబాబాను పోలీసులు ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి 9 మే 2014న అరెస్టు చేశారు. అతని ఇంటి నుంచి విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications