E20 Petrol: మైలేజ్ తగ్గుతోందా? రాజ్యసభలో గడ్కరీ కీలక ప్రకటన!

భారతదేశంలో పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను వేగంగా అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలోనే 20 శాతం ఎథనాల్ కలిపిన 'E20 పెట్రోల్' వాడకంపై వాహనదారుల్లో ఎన్నో సందేహాలు, భయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పాత వాహనాల ఇంజన్లు పాడవుతాయనే వార్తలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. 2016 కంటే ముందు తయారైన పాత BS-III వాహనాల్లో కొన్ని విడిభాగాలకు మాత్రమే స్వల్ప మార్పులు అవసరమవుతాయని ఆయన స్పష్టం చేశారు.

అధికారిక సర్వేలో తేలింది ఇదే!

E20 ఇంధనం వల్ల వాహనాల పనితీరు, మైలేజ్ , ఇంజన్ మన్నికపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై ఇండియన్ ఆయిల్ (IOCL), ఐఐపీ దేహ్రాదూన్, సియామ్ (SIAM), ఏఆర్ఏఐ (ARAI) సంయుక్తంగా క్షేత్రస్థాయిలో విస్తృత అధ్యయనం చేశాయి. రెండు, నాలుగు చక్రాల వాహనాలపై జరిపిన ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల స్టార్టింగ్, డ్రైవింగ్ లేదా ఇంజన్‌లోని పార్ట్స్, ప్లాస్టిక్ భాగాలకు ఎలాంటి ముప్పు లేదని ఈ నివేదిక తేల్చిచెప్పింది.

E20 Petrol May Harm Older BS3 Vehicles Nitin Gadkari Clarifies Rubber Parts Impact in Rajya Sabha
E20 Petrol: తిరుగుబాటు మొదలైంది, ఆగస్టు 4న పార్లమెంట్ మార్చ్!
E20 Petrol: తిరుగుబాటు మొదలైంది, ఆగస్టు 4న పార్లమెంట్ మార్చ్!

ఏ వాహనాలకు మార్పులు అవసరం?

2005 ఏప్రిల్ 1 నుంచి 2016 మధ్య కాలంలో తయారైన పాత బిఎస్-3 (BS-III) మోడల్ వాహనాల్లో మాత్రమే ఈ పెట్రోల్ వల్ల చిన్నపాటి ప్రభావం ఉండవచ్చని మంత్రి తెలిపారు. ఈ రకం వాహనాల్లో ఉపయోగించిన కొన్ని రబ్బరు విడిభాగాలు, గాస్కెట్లు E20 పెట్రోల్ ప్రభావానికి గురై దెబ్బతినే అవకాశం ఉంది. అయితే దీనికోసం భయపడాల్సిన పనిలేదని, సాధారణంగా వాహన సర్వీసింగ్ చేయించే సమయంలోనే ఈ రబ్బరు పార్ట్స్‌ను చాలా సులభంగా మార్చుకోవచ్చని గడ్కరీ వివరించారు.

ఈ20 పెట్రోల్ వివాదం: కోర్టుకెక్కిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ!
ఈ20 పెట్రోల్ వివాదం: కోర్టుకెక్కిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ!

మైలేజ్ తగ్గడానికి అసలు కారణాలు ఇవే!

ఈ మధ్య కాలంలో పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతోందని, ఇంజన్ల నుంచి వింత శబ్దాలు వస్తున్నాయని కొందరు వాహనదారులు భావిస్తున్నారు. కానీ దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. కేవలం ఇంధనం ఒక్కటే మైలేజ్‌ను నిర్ణయించదని స్పష్టం చేసింది. వాహనం నడిపే విధానం, సరైన సమయంలో ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్లు మార్చడం, టైర్లలో సరైన గాలి ఒత్తిడి మెయింటెన్ చేయడం, ఏసీ వాడకం వంటి అనేక అంశాలు మైలేజ్‌పై ప్రభావం చూపుతాయని తెలిపింది. కాబట్టి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకుంటే E20 పెట్రోల్‌తో పాత వాహనాలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+