అప్పుడు ప్రధానిని.. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిని ఆడిస్తున్నారు: కాంగ్రెస్‌పై మోడీ సెటైర్లు
భోపాల్: కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దామోహ్‌లో బీజేపీ తరపున ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో భూమి నుంచి ఆకాశం వరకు దేశం గర్వపడుతోందన్నారు. ప్రపంచంలో ఏ దేశం కూడా చేరని చంద్ర గ్రహం మీదకు భారత్ చేరిందని చంద్రయాన్-3 గురించి మోడీ చెప్పారు. జీ20 సదస్సును ప్రపంచం ప్రశంసించిందన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయన్నారు ప్రధాని మోడీ. క్రీడా రంగంలోనూ ఎన్నడూ లేని విధంగా పతకాల పంట పండుతోందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ.. దేశంలో పేదరికాన్ని తుచిచేస్తామంటూ కాంగ్రెస్ గత 50 ఏళ్లకుపైగా చెప్పుకుంటూ వస్తోందని.. అయితే, ఆ దిశగా మాత్రం ఎలాంటి ప్రయత్నం చేయదని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీని ప్రజలు కోరుకోవడం లేదన్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మళ్లీ పేదరికంలోకి వెళుతుందని హెచ్చరించారు ప్రధాని మోడీ. కాంగ్రెస్ రాష్ట్రాన్ని తిరిగి బిమారూ రాష్ట్రంగా మారుస్తుందన్నారు. '2014లో (కేంద్రంలో) మేము (కేంద్రంలో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు.. నేను కాంగ్రెస్ అవినీతి యంత్రాల టైర్లన్నీ పంక్చర్ చేసాను. కాంగ్రెస్ అవినీతి యంత్రం భరించలేని.. ఆధార్, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ 'త్రిశక్తి'ని సృష్టించాము. "అన్నారాయన.
గత ప్రధాని మన్మోహన్ సింగ్‌ను రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేశారని ఆరోపించిన ఆయన.. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పరిస్థితి కూడా అలాగే ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై విమర్శలు గుప్పించారు ప్రధాని మోడీ.
రిమోట్ ఆన్‌లో ఉండగానే సనాతన్‌ని దుర్భాషలాడాడు.. కానీ రిమోట్ ఆఫ్ చేయగానే సనాతన్ గుర్తొచ్చిందని ఎద్దేవా చేశారు. బీజేపీలో 5 మంది పాండవులు ఉన్నారంటూ వారన్నారని.. తాము పాండవుల మార్గంలో నడుస్తున్నందుకు గర్వపడుతున్నామని చెప్పారు.
#WATCH | PM Modi attacks Congress during his election rally in Madhya Pradesh's Damoh
— ANI (@ANI) November 8, 2023
"...This is the time to remain beware of the Congress party. It is that party that snatches money belonging to the poor, indulges in scams, and divides the society for chair; for Congress, the… pic.twitter.com/z4Hs3a1cpx
దామోహ్ తర్వాత బుందేల్‌ఖండ్, గ్వాలియర్-చంబల్ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మరో రెండు ర్యాలీలు కూడా నిర్వహించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కొనసాగుతుందన్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లో 230 మంది సభ్యులున్న శాసనసభకు నవంబర్ 17న సింగిల్ ఫేజ్ ఓటింగ్ జరగనుండగా.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణలతో పాటు డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
-
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications