ఈసీ బ్యాన్ : ’చౌకీదార్ చోర్ హై‘ వీడియోపై నిషేధం, రాహుల్‌కు లేఖ

న్యూఢిల్లీ : ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారి తాట తీస్తోంది ఎన్నికల సంఘం. తాజాగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన 'చౌకీ దార్ చోర్ హై' వీడియోపై నిషేధం విధించింది. ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి లేఖ కూడా రాసింది. ఆ ప్రచార వీడియోను నిలిపివేయాలని స్పష్టంచేసింది. సీఈసీ ఆదేశాలతో మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారి అన్ని జిల్లాల అధికారులకు సమాచారం అందించారు.

ec ban on chowkidar chor hai video

వక్రీకరణ .. అబ్బే అదేం లేదే ?
ప్రధాని మోదీ దేశానికి చౌకీదార్ (నేను మీ కాపాలాదారు) అనే నినాదం చేస్తున్నారు. దీనిని కాంగ్రెస్ వక్రీరించి చౌకీదార్ చోర్ హై (కాపాలాదారే దొంగ) అని వీడియోను రూపొందించిందని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీజేపీ కంప్లైంట్ ఆధారంగా ఈసీ చర్యలు తీసుకుంది. అయితే ఆ వీడియాలో తాము ఎవరినీ వ్యక్తిగతంలో విమర్శించలేదని కాంగ్రెస్ చెబుతోంది.

వాట్ నెక్ట్స్ ?
ఇటీవల రాజకీయ నేతలు తమ ప్రచారంలో భాగంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. దీంతో వారిని ప్రచారంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మాయావతి, యోగి ఆదిత్యనాథ్, ఆజాంఖాన్, మేనకాగాంధీపై ఈసీ కొరఢా ఝులిపించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రచార వీడియో నిలిపివేయకుంటే .. ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననే చర్చకు దారితీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+