11 పార్టీల భేటీ: మూడో కూటమి యత్నాలు

నాలుగు వామపక్షాలు, సమాజ్‌వాది, అన్నాడిఎంకే, అసోం గణపరిషత్ (ఎజిపి), జార్ఖండ్ వికాస్ మోర్చా, జెడిఎస్, బిజెడి, జెడియు పార్టీల నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతరం వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
తమ కలయికను 'మూడో కూటమి'గా వ్యవహరించరాదని సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి, జెడియు అధ్యక్షుడు శరద్‌యాదవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ నెల 9, 10 తేదీల్లో మరోసారి సమావేశమై కొత్త కూటమి అజెండాను ఖరారు చేస్తామని నితీశ్ చెప్పారు.
సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలవడం, ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం కూడా సమాఖ్య ఏర్పాటును పటిష్టం చేయడానికేనని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఆయన మూడో కూటమి ఏర్పాటు దిశగా కదిలారు.












Click it and Unblock the Notifications