బీహార్ లో ఎన్నికల నగారా, గెలుపెవరిది- జూబ్లీహిల్స్ లో సై..!!
బీహార్ ఎన్నికల షెడ్యూల్ సిద్దమైంది. ఈ సాయంత్రం ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్దమైంది. క్షేత్ర స్థాయిలో పర్యటన తరువాత అధికారికంగా షెడ్యూల్ ను ఈ రోజు ప్రకటించాలని నిర్ణయించింది. నవంబర్ 22వ తేదీ లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ బై పోల్ కు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. దీంతో.. బీహార్ లో ఎవరు గెలుస్తారు.. జూబ్లీహిల్స్ లో పాగా వేసేదెవరు అనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
బీహార్ ఎన్నికల సమరానికి ఎన్నికల సంఘం సిద్దమైంది. ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. రెండు లేదా మూడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.2025 నవంబర్ 22తో ముగుస్తుంది. ఈ లోగానే కొత్త అసెంబ్లీ ఏర్పాటు దిశగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది.

గతంలో బీహార్‌లో మూడు, ఐదు విడతల్లో పోలీంగ్ నిర్వహించారు. ఈ సారి ఒకే విడత పోలింగ్ జరపాలని జేడీయూ కోరగా.. రెండు, మూడు దశల్లో నిర్వహించాలని మిగతా పార్టీలు కోరాయి. బీహార్ ఎన్నికల పరిశీలకులుగా 470 మంది అబ్జర్వర్లను ఎన్నికల సంఘ నియమించింది. అక్టోబర్ 28న ఛత్ పండగ ఉండటంతో.. అక్టోబర్ 31 తర్వాత తొలి దశ నిర్వహించే అవకాశం ఉండే అవకాశం ఉంది.
ఇక, ఇప్పటికే పలు సర్వే సంస్థలు బీహార్ లో ఓటర్ల నాడి పట్టుకునే ప్రయత్నం చేసాయి. పలు సర్వే సంస్థలు ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుందని అంచనా వేసాయి. ప్రధాని మోదీ బీహార్ లో పలు మార్లు పర్యటించారు. బీహార్ కోసం గత బడ్జెట్ నుంచి ఇప్పటి వరకు కేంద్రం పలు వరాలు ప్రకటించింది. కాగా, అభ్యర్ధుల ఖరారు.. మేనిఫెస్టోల తరువాత బీహార్ ఎన్నికల సమరం మరింత వేడెక్కే అవకాశం ఉంది.
కాగా, ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఈ రోజు షెడ్యూల్ విడుదల కానుంది. బీహార్ ఎన్నికలతో పాటుగానే ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్ధిని ఖరారు చేసింది. కాంగ్రెస్ బీసీ అభ్యర్ధిని బరిలోకి దింపనుంది. బీజేపీ తమ అభ్యర్ధి ఖరారు పైన కసరత్తు చేస్తోంది. జూబ్లీహిల్స్ లో గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం కావటంతో.. ఈ రోజు షెడ్యూల్ తరువాత రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications