జీతం సరిపోలేదని దొంగతనాలు: టెక్కీ అరెస్ట్

భువన్ సుమారు 25 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇళ్లల్లోని వారు విధులు నిమిత్తం బయటికి వెళ్లిన సమయంలో భువన్ ఈ చోరీలకు పాల్పడుతుండేవాడు. ఈ దొంగతనాలన్నింటినీ ఒక్కడే చేసేవాడని పోలీసులు తెలిపారు. తన బైకుపై వెళ్లేవాడని చెప్పారు. 2008లో నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన భువన్.. రూ.8వేల జీతానికి ఓ కంపెనీలో చేరాడు. అయితే జీతం తనకు సరిపోవడం లేదని ఉద్యోగం మానేసిన భువన్.. తన స్నేహితుల ల్యాప్‌టాప్‌లను దొంగతనం చేయడం ప్రారంభించాడు.
అతడ్ని దొంగగా స్నేహితులు అనుమానించకపోవడంతో దొంగతనమే తన ఉద్యోగం చేసుకున్నాడు. ఆ తర్వాత బంగారు ఆభరణాలను దొంగిలించడం ప్రారంభించాడు. ఎవరూ లేని సమయంలో నగరంలోని ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. అయితే సోమవారం వినోద్ అనే సాష్ట్‌వేర్ ఇంజినీర్‌ను కత్తితో బెదిరించి కంప్యూటర్ హార్ట్ డిస్క్, రూ. వెయ్యిని దొంగలించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ప్రదీష్ భువన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర్నుంచి కిలో బంగారం, 1.75 కిలోల వెండి, 21 ల్యాప్‌టాప్‌లు, రూ. 50వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications
