Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Enquiry: కాంట్రాక్టర్ ఆత్మహత్య, 40 శాతం కమీషన్ ?, అసరం అయితే మంత్రి కేఎస్ ను అరెస్టు చేస్తాం, సీఎం !

బెంగళూరు: ప్రముఖ కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసు కర్ణాటక బీజేపీ సీనియర్ నాయకుడు, పవర్ ఫుల్ మంత్రి కేఎస్. ఈశ్వరప్ప మెడకు చుట్టుకుంది. తనకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించడానికి మంత్రి 40 శాతం కమీషన్ అడుగుతున్నారని ఆరోపిస్తూ డెత్ నోట్ రాసిన కాంట్రాక్టర్ లాడ్జల్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో అధికార పార్టీ నాయకులు ఇరుకునపడ్డారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున బెంగళూరులో, ఢిల్లీలో ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్ కులం నాయకులు అధికార పార్టీకి పూర్తి మద్దతుదారులు కావడంతో ఇప్పుడు సీఎంతో పాటు ఆ పార్టీ నేతలు ఏం చెయ్యాలో అర్థంకాక అయోమయంలో పడిపోయారు. కాంట్రాక్టర్ ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధంలేదని, కేసు దర్యాప్తు సవ్యంగా జరగడానికి తాను స్వచ్చందంగా రాజీనామా చేస్తున్నానని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కేఎస్. ఈశ్వరప్ప అంటున్నారు. కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో మంత్రిని అరెస్టు చెయ్యాలని బాధితుడి కుటుంబ సభ్యులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ మీడియాతో మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు అవసరం అనుకుంటే మంత్రి కేఎస్. ఈశ్వరప్పను అరెస్టు చేస్తారని, ఆ విషయంలో మా ప్రభుత్వం రాజీపడదని, మా పార్టీ నేత, ప్రతిపక్ష నేత అని మాకు తేడాలేదని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ప్రముఖ కాంట్రాక్టర్ ఆత్మహత్య

ప్రముఖ కాంట్రాక్టర్ ఆత్మహత్య

కర్ణాటకలోని బెళగావికి చెందిన సంతోష్ పాటిల్ ప్రముఖ కాంట్రాక్టర్. ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేస్తున్న సంతోష్ పాటిల్ బీజేపీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఉడిపిలోని శాంబవి హోటల్స్ లోని లాడ్జ్ లో బస చేసిన కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ తన ఆత్మహత్యకు కర్ణాటక మంత్రి కేఎస్. ఈశ్వరప్ప కారణం అంటూ డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

బిల్లులో 40 శాతం కమీషన్ ?

బిల్లులో 40 శాతం కమీషన్ ?

తాను చేసిన కాంట్రాక్టు పనులు బిల్లులు చెల్లించాలంటే మంత్రి కేఎస్. ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ అడుగుతున్నారని ఆరోపిస్తూ డెత్ నోట్ రాసిన కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఉడిపిలోని లాడ్జ్ లో లో ఆత్మహత్య చేసుకోవడంతో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ఇరుకునపడ్డారు.

 ఉలిక్కిపడిన సీఎం

ఉలిక్కిపడిన సీఎం

కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసు విషయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బెంగళూరులో, ఢిల్లీలో ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ లింగాయత్ కులానికి చెందిన వాడు. లింగాయత్ కులం నాయకులు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి సంపూర్ణ మద్దతుదారులు కావడంతో ఇప్పుడు సీఎం బసవరాజ్ బొమ్మయ్ తో పాటు ఆ పార్టీ నేతలు ఏం చెయ్యాలో అర్థంకాక అయోమయంలో పడిపోయారు.

మంత్రి ఈశ్వరప్ప క్లారిటీ

మంత్రి ఈశ్వరప్ప క్లారిటీ

కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధంలేదని, కేసు దర్యాప్తు సవ్యంగా జరగడానికి తాను స్వచ్చందంగా రాజీనామా చేస్తున్నానని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కేఎస్. ఈశ్వరప్ప అంటున్నారు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో మంత్రి కేఎస్. ఈశ్వరప్పను అరెస్టు చెయ్యాలని బాధితుడి కుటుంబ సభ్యులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

 సీఎం మాటలతో ఈశ్వరప్ప వర్గీయులు హడల్

సీఎం మాటలతో ఈశ్వరప్ప వర్గీయులు హడల్

కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసు విషయంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ శుక్రవారం హుబ్బళి ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు అవసరం అనుకుంటే మంత్రి కేఎస్. ఈశ్వరప్పను అరెస్టు చేస్తారని, ఆ విషయంలో మా ప్రభుత్వం రాజీపడదని, మా పార్టీ నేత, ప్రతిపక్ష నేత అని మాకు తేడాలేదని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసు నుంచి ఎవరిని రక్షించడానికి మా ప్రభుత్వం ప్రయత్నాలు చెయ్యడంలేదని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+