దినకరన్‌కు మద్దతు: ఆరుగురు అన్నాడీఎంకే నేతలపై వేటు
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు మద్దతిచ్చిన అన్నాడీఎంకేలో ఆరుగురు నేతలపై వేటు పడింది. సోమవారం జరిగిన అన్నాడీఎంకే ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పరాజయంపై ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరిగింది. అనంతరం ఎస్ వెట్రివేల్, తంగ తమిల్ సెల్వర్, రంగస్వామి, ముత్తయ్య, కలైరాజన్, షోలింగూర్ పార్థిబన్‌లను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

టీటీవీ దినకరన్‌కు మద్దతిచ్చి వీరంతా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే తొలగించినట్లు అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. కాగా, ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్ పై 40వేలకుపైగా మార్జిన్ తో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ గెలుపు తర్వాత తానే దివంగత సీఎం జయలలిత నిజమైన వారసుడినని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications