ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అత్యవసర మందుల ధరలు
న్యూఢిల్లీ: ఏప్రిల్ నెల నుంచి సామాన్యులపై మందుల రూపంలో మరి కొంత భారం పడనుంది. ఏప్రిల్ 1 నుంచి పలు అత్యవసర ఔషధాలు ధరలు పెరగనున్నాయి. 923 రకాల ఫార్ములాలతో కూడిన అత్యవసర ఔషధాల ధరలు ఏప్రిల్ నుంచి మరింత పెరగనున్నాయి. ఇందులో పెయిన్‌కిల్లర్లు, యాంటిబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ మందులు ఉన్నాయి. ఈ మేరకు జాతీయ ఔషధాల ధరల సంస్థ (NPPA) వెల్లడించింది.
ఈ మేరకు ఎన్‌పీపీఏ జారీ చేసిన నోటిఫికేషన్లో మందుల 'టోకు ధరల సూచీ'లో వార్షిక మార్పును ప్రకటించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ వెల్లడించిన టోకు ద్రవ్యోల్బణ సూచీ గణాంకాల ప్రకారం.. 2023 సంవత్సరానికి గానూ మందుల టోకు ధరల సూచీని ఎన్‌పీపీఏ తాజాగా పేర్కొంది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ సూచీ 0.0055 శాతం పెరిగినట్లు పేర్కొంది. అంటే. అత్యవసర జాబితాలో ఉండే ఔషధాల ధరలు 0.0055 శాతం పెరగనున్నాయి.

ఈ పెంపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మార్పులతో, మందుల తయారీదారులు ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే WPIలో సూచించిన ధరలకు అనుగుణంగా షెడ్యూల్ చేసిన ఫార్ములాల మందులపై MRPని పెంచొచ్చు. ఇందులో యాంటీబయాటిక్స్, యాంటీమలేరియల్స్, టైప్ 2 డయాబెటిస్‌కు మందులు వంటి ముఖ్యమైన మందులు ఉన్నాయి.
పెరిగిన ధరల ప్రకారం పెయిన్‌కిల్లర్ అయిన డైక్లోఫెనాక్ (Diclofenac) ఇప్పుడు ఒక్కో టాబ్లెట్ ధర రూ. 2.05 ఉంటుంది. అయితే ఇబుప్రోఫెన్ (Ibuprofen) టాబ్లెట్‌ల ధర రూ.71(200 Mg), రూ.1.20 (400 Mg) ఉంటుంది.












Click it and Unblock the Notifications