ఈవ్ టీజింగ్: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
మైసూర్: ఆకతాయి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఉరివేసుకుని తన చనువును చాలించింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లాలోని మైరల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు సంజుపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బాధిత యువతి సుష్మిత(15) గ్రామంలోని ప్రభుత ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో ప్రతి రోజూ తన కూతురును నిందితుడు వేధింపులకు గురి చేసేవాడని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.

వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో అతను నిందితుడు సంజూ, అతని కుటుంబసభ్యులను హెచ్చరించారు. అయినప్పటికీ సంజు తన వికృత చేష్టలను మార్చుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఘటనా స్థలాన్ని సందర్శించిన బ్లాక్ విద్యాధికారులు, పోలీసులు, దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. బాధిత యువతి చదువులో ఎప్పుడూ ముందు ఉండేదని, ప్రతిభగల విద్యార్థి అని ఆయన చెప్పారు. అయితే వేధింపుల విషయంపై పాఠశాల ఉపాధ్యాయులకు ఆమె ఫిర్యాదు చేయలేదని తెలిపారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications