విద్యార్థుల ప్రశ్నలు : సుందర్ పిచాయ్ సమాధానాలు

న్యూఢిల్లీ: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గురువారం ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. హర్షా భోగ్లే దీనికి కామెంటేటర్‌గా వ్యవహరించారు. పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సుందర్ సమాధానం ఇచ్చారు.

ప్రశ్న: క్లాస్ 12లో మీ స్కోర్ ఎంత?
సుందర్ పిచాయ్: శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో చేరేందుకు నాకు వచ్చి మార్కులు సరిపోవు.

ప్రశ్న: భవిష్యత్తు కోసం ఎలా తీర్చిదిద్దుకోవాలి?
సుందర్ పిచాయ్: ప్రతి ఒక్కరిలో క్రియేటివిటీ ఉంటుంది. విద్యార్థులు కొత్త సవాళ్లను స్వీకరించి కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. కలల్ని సాకారం చేసుకునేందుకు ప్రయత్నించారు.

ప్రశ్న: మీరు మొదటి ఫోన్ ఎప్పుడు తీసుకున్నారు?
సుందర్ పిచాయ్: 1994-95లో మొదటి సారి మోటరోలా ఫోన్ వాడాను. 2006లో తొలిసారి స్మార్ట్ ఫోన్ వాడాను. నా ఇంట్లో దాదాపు ఇరవై నుంచి ముప్పై వరకు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.

 Everything Google CEO Sundar Pichai said at SRCC

ప్రశ్న: మీరు యంగ్‌లో ఉన్నప్పుడు చాలా ఫోన్ నెంబర్స్ గుర్తు పెట్టుకునే వారు కదా?
సుందర్ పిచాయ్: నవ్వుతూ.. అప్పుడు ఆరు డిజిట్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు నేను నా స్మార్ట్ ఫోన్‌లో స్టోర్ చేసుకుంటున్నాను.

ప్రశ్న: స్టూడెంట్ డెవలపర్లకు సహకరించేందుకు గూగుల్ ఎందుకు ముందుకు వచ్చింది?
సుందర్ పిచాయ్: చాలా దేశాలలో కంటే భారత్‌లో యువతకు సాఫ్టువేర్ డెవలప్మెంట్ పైన ఆసక్తి ఎక్కువ. అలాంటి వారిని ఇరవై లక్షల మందికి శిక్షణను ఇచ్చి ఉత్తమ డెవలపర్లుగా చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం భారత్‌లోని 30 విశ్వవిద్యాలయాలతో ఒప్పందం చేసుకున్నాం.

ప్రశ్న: మీరు గూగుల్ సీఈవో కాకపోయి ఉంటే?
సుందర్ పిచాయ్: భవిష్యత్తు కోసం సాఫ్టువేర్ ప్రాడక్ట్స్ తయారు చేసేవాడిని. అవి చేయడం ఇష్టం.

ప్రశ్న: ఆండ్రాయిడ్ ఎం.. మార్ష్‌మాలో, మరి ఎన్.. ఏదైనా భారతీయ పేరు పెట్టవచ్చు కదా?
సుందర్ పిచాయ్: దీని గురించి ఆలోచిస్తాం. ఆన్ లైన్ పోల్ నిర్వహిస్తాం. సాధ్యమవుతుందో చూడాలి.

ప్రశ్న: కార్యాలయాల్లో మహిళలు తక్కువగా ఉంటున్నారు కదా?
సుందర్ పిచాయ్: ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. భారత్‌లో కొంచెం ఎక్కువ. ఇక్కడి గ్రామీణ మహిళలు ఇంటర్నెట్ గురించి ఆలోచించరు. వారిని ఆన్ లైన్ లోకి తేవడానికి కృషి చేస్తాం.

ఫ్రీ వైఫై గురించి ఒకరు అడగగా... నేను కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో చెన్నై నుంచి ఐఐటీ ఖరగ్‌పూర్ వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. మరో ప్రశ్నపై మాట్లాడుతూ... గూగుల్ ఎప్పుడు సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తుందని సమస్యలు పరిష్కరించాలని చూస్తామన్నారు. కాగా, కామెంటేటర్ హర్షాబోగ్లో.. సుందర్ పిచాయ్‌తో కలిసి 360 డిగ్రీల సెల్ఫీ తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+