పన్నీరుకు ఇద్దరు మద్దతు: 'శశికళ కారణంగా.. అందరిలోను అనుమానం'
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ పార్టీ అధ్యక్షులు పన్నీర్ సెల్వం వర్గానికి మరో ఇద్దరు ప్రముఖులు మద్దతు తెలిపారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల తరుణంలో వరుసగా ఆయనకు మద్దతు వస్తుండటం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ పార్టీ అధ్యక్షులు పన్నీర్ సెల్వం వర్గానికి మరో ఇద్దరు ప్రముఖులు మద్దతు తెలిపారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల తరుణంలో వరుసగా ఆయనకు మద్దతు వస్తుండటం గమనార్హం.
తాజాగా, ప్రముఖ తమిళ గేయ రచయిత స్నేషాన్, మాజీ మంత్రి రాజా కన్నప్పన్ పార్టీకి తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పన్నీర్ సెల్వం స్థాపించిన అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ పార్టీనే నిజమైన ఏఐఏడీఎంకే పార్టీగా పేర్కొన్నారు.

వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పన్నీర్ సెల్వం చెప్పారు. శశికళ కుటుంబం కారణంగా పార్టీ నుంచి వీడిపోయిన అన్నాడీఎంకే నాయకులందరినీ తిరిగి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో పార్టీని గెలిపించి అమ్మ మాటను నిజం చేస్తానన్నారు.
అమ్మ మృతి 7.5 కోట్ల మంది తమిళుల మనస్సుల్లో ఇప్పటికీ ఓ సందేహంగానే మిగిలిపోయిందన్నారు. అమ్మ అస్తమించిన తర్వాత పార్టీ అంతా ఓ కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోయిందని, దానిని అడ్డుకునేందుకే కొత్త పార్టీ స్థాపించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.












Click it and Unblock the Notifications